• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • 60 YEAR OLD NEIGHBOUR MOLESTS 3 YEAR OLD IN NORTHEAST DELHI S MUSTAFABAD NK

మూడేళ్ల చిన్నారిపై కన్నేసిన 60 ఏళ్ల ముసలోడు... ఆ తర్వాత

మూడేళ్ల చిన్నారిపై కన్నేసిన 60 ఏళ్ల ముసలోడు... ఆ తర్వాత

మూడేళ్ల చిన్నారిపై కన్నేసిన 60 ఏళ్ల ముసలోడు... ఆ తర్వాత (credit - reuters)

Delhi : నిర్భయ దోషులకు ఉరి తీసిన రోజే ఈ దారుణం జరిగింది. పిల్లల్ని కాపాడుకోవడం తల్లిదండ్రులకు చాలా కష్టమైపోతోంది.

 • Share this:
  Delhi Crime News : అది ఢిల్లీకి ఈశాన్యంగా ఉండే ముస్తాబాద్. అక్కడో సందు. దాని చివర్లో ఓ ఇల్లు. అక్కడి అరుగుపై మూడేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. అప్పుడప్పుడే మాటలొస్తున్నాయి. ఇంట్లో తల్లి చేతులకు హ్యాండ్ శానిటైజర్ రాసుకొని... వంట కోసం కూరగాయల్ని కోసే పనిలో పడింది. ఆ వీధిలో వచ్చే పోయే వాళ్లను అమాయకంగా చుస్తూ... తన దగ్గరున్న అరవలేని బొమ్మ అరిస్తే బాగుండని ఆసిస్తోంది ఆ చిన్నారి. ఆ బొమ్మ పొట్టలో నొక్కుతూ... కుయ్ మంటుందేమో అని చూస్తోంది. సరిగ్గా అప్పుడే ఓ 60 ఏళ్ల ముసలోడు ఆ ఇంటివైపు చూస్తూ... రోడ్డుపై వెళ్లాడు. రెండు నిమిషాల తర్వాత... మళ్లీ వెనక్కి వచ్చాడు. అప్పుడూ అదే చూపు. ఇంట్లో ఎవరూ లేరు అనుకున్నాడు. చిన్నారి దగ్గరకు వచ్చి... చిచ్చీ బుజ్జీ అంటూ.... నలిగిపోయిన చాక్లెట్ చేతిలో పెట్టాడు. బొమ్మను వదిలేసిన పాప... చాక్లెట్ పట్టుకుంది. నీకు బోలెడ్ చాక్లెట్లు ఇవ్వనా... అంటూ చిన్నారిని ఎత్తుకున్నాడు.

  తల్లి ఎప్పుడూ చెప్పే బూచాడు ఇలా ముసలోడి రూపంలో వచ్చాడని చిన్నారికి తెలియదు కదా... అతని చంకనెక్కి కూర్చుంది. రోజూ చూసే ముసలాడే కాబట్టి ఆ చిన్నారికి అతనిలో రెండో కోణం తెలియలేదు. పాపను తన ఇంటికి తీసుకెళ్లిన ముసలోడు... తలుపులు వేసేశాడు. ఐతే... అక్కడ ఓ పిల్లాడికి... చుట్టుపక్కల ఎవరు ఏం చేస్తుంటారా అని గమనిస్తూ ఉండే అలవాటుంది. అది చెడ్డ బుద్ధే అయినా ఇప్పుడు మాత్రం అది పాపను కాపాడింది అనుకోవచ్చు. ముసలోడు ఏం చేస్తున్నాడా అని... ఆ ఇంటి మూసి వున్న కిటికీకి ఉన్న చిన్న కన్నం లోంచీ బలవంతంగా చూశాడు. ముసలోడు పాప బట్టల్ని ఊడదీస్తూ... బోలెడు చాక్లెట్లు ఇస్తా అంటుంటే... అది చూసి షాకైన పిల్లాడు... ఒక్కసారిగా పరుగు మొదలుపెట్టాడు.

  క్షణాల్లో పాప ఇంటికి వెళ్లి... పాప తల్లికి అంటీ అంటీ అంటూ అంతా చెప్పాడు. ఆ తల్లికి గుండెలు జారిపోయాయి. చేతిలో క్యారెట్... కట్ అవ్వకుండానే కింద పడింది. ఆ పిల్లాడి కంటే వేగంగా పరిగెత్తిన తల్లి... తన బలమంతా ఉపయోగించి... ముసలోడి ఇంటి తలుపును గట్టిగా తట్టింది. ఆ సౌండ్‌కి హర్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది ముసలోడికి. గబగబా పిల్లకు బట్టలు తొడిగేశాడు. ముఖానికి పట్టిన చెమటల్ని తుడిచేసుకుంటూ... లేని నవ్వును చిందిస్తూ... పాపను తల్లికి అప్పగించాడు. నరికిపారేయాలన్నంత కోపంగా అతనివైపు చూసిన తల్లి... ఆవేశాన్ని అణచుకొని... ఏడుస్తున్న చిన్నారిని... ఓదార్చుతూ... ఇంటికి వెళ్లింది. సొరుగులో మొబైల్ తీసి... తన భర్తకు కాల్ చేసింది.

  పొరుగూరిలో పనికి వెళ్లిన ఆయన... పది నిమిషాల్లో ఇంటికి వెళ్లాలని ప్రయత్నించి... అరగంటలో చేరుకున్నాడు. తర్వాత పాపను తీసుకొని... పోలీసుల్ని కలిశారు. కేసు రాసిన పోలీసులు పాపను ఆస్పత్రిలో చూపించారు. డాక్టర్... పాపకు శారీరకంగా ఎలాంటి సమస్యా రాలేదని చెప్పారు. దాంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇప్పుడు పోలీసుల వంతైంది.

  తనకు శాస్తి తప్పదని ఆల్రెడీ డిసైడైన ముసలోడు... కుర్చీలో కూర్చొని బిక్కుబిక్కుమంటున్నాడు. పోలీస్ సైరన్ వినపడగానే... పక్కనే ఉంచుకున్న గ్లాస్‌లో వాటర్ తాగుదామని ప్రయత్నించి... సరిగా తాగలేక... కంగారులో గ్లాస్ కిందపడేశాడు. అంతలోనే ఎంటరైన పోలీసులు... నీకు నీళ్లు మేం తాగిస్తాంగా పద అంటూ తీసుకెళ్లారు. పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చూశారా... పిల్లల్ని కాపాడుకోవడం తల్లిదండ్రులకు ఎంత కష్టమైపోతోందో. అసలే కరోనా వైరస్ సమస్య వేధిస్తోంది. దాన్నుంచీ తప్పించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్న పేరెంట్స్‌కి ఇలాంటి చుట్టుపక్కల శత్రువులతో సమస్యలు ఎక్కువవుతున్నాయి. పేరెంట్స్ బీ మోర్ అలర్ట్.
  Published by:Krishna Kumar N
  First published: