అత్యాచారం చేసిన దొంగ దొరికాడు.. 60 మంది పోలీసులకు టెన్షన్

ఓ నిందితుడికి కరోనా పాజిటివ్ రావడంతో... ఏకంగా 60 మంది పోలీసులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది.

news18-telugu
Updated: July 6, 2020, 7:55 PM IST
అత్యాచారం చేసిన దొంగ దొరికాడు.. 60 మంది పోలీసులకు టెన్షన్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ అత్యాచారం కేసు నిందితుడిని అరెస్ట్ చేసిన కారణంగా ఏకంగా 60 మంది పోలీసులు క్వారంటైన్‌కు వెళ్లాల్సి వచ్చింది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై మహిళ లైంగిక దాడికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో... అతడిని పట్టుకునేందుకు నలుగురు పోలీసులు మైసూరు వెళ్లారు. అతడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. యథావిథిగా అతడిని రిమాండ్‌కు తరలించారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. అతడిని రిమాండ్‌కు తరలించే ముందు జరిపిన వైద్య పరీక్షల్లో నిందితుడికి కరోనా పాజిటివ్ అని తేలింది.

ఈ విషయాన్ని జైలు అధికారులు అతడిని మైసూరు నుంచి తీసుకొచ్చిన పోలీసులకు తెలిపారు. దీంతో ఆ పోలీసులతో కలిసి విధులు నిర్వహించిన 60 మంది పోలీసులు క్వారంటైన్‌కు వెళ్లాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అంతేకాదు బిలాస్‌పూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు సీల్ వేసి ఆ ప్రాంతాన్ని కంటైన్’మెంట్ జోన్‌గా ప్రకటించారు.

Published by: Kishore Akkaladevi
First published: July 6, 2020, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading