ఆరేళ్ల బాలికను గొంతుకోసి చంపేశాడు.. మేడ్చల్‌లో దారుణం

(ప్రతీకాత్మక చిత్రం)

అనూషకు ఫేస్‌బుక్ ద్వారా కరుణాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలుస్తోంది.

  • Share this:
    వివాహేతర సంబంధం ఓ చిన్నారిని బలితీసుకుంది. తల్లిపై కోపంతో కూతురిని చంపేశాడో కిరాతకుడు. ఆరేళ్ల పసిపాపను గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. మేడ్చల్ జిల్లా పోచారంలో ఈ ఘోరం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కూతురుంది. ఆ చిన్నారి పేరు ఆద్య. అనూషకు ఫేస్‌బుక్ ద్వారా కరుణాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలుస్తోంది. ఐతే ఇటీవల రమేష్ అనే మరో యువకుడితో అనూష సన్నిహితంగా ఉన్నట్లు కరుణాకర్ దృష్టికి రావడంతో.. ఆమెపై కోపం పెంచుకున్నాడు.

    ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం అనూష ఇంటికి వచ్చాడు కరుణాకర్. అప్పటికే అనూష ఇంట్లో రమేష్ ఉండటంతో మరింత తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కరుణాకర్ వచ్చాడని గమనించి, రమేష్‌ను బాత్‌రూంలో దాచింది అనూష. బాత్రూమ్ నుంచి బయటకు రావాలని కరుణాకర్ అరిచాడు. లేదంటే చిన్నారి ఆద్యను చంపేస్తానని.. మెడపై సర్జికల్ కత్తిపెట్టి బెదరించాడు. ఐనప్పటికీ అతడు రాకపోవడంతో.. అన్నట్లుగానే ఆద్యను గొంతుకోసి చంపేశాడు. చిన్నారి అరుపులు విన్న రమేష్ బాత్రూమ్‌ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత రమేష్‌పై దాడి చేసి.. తానూ గాయపరచుకున్నాడు కరుణాకర్. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. కరుణాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆద్య తండ్రికి సమాచారం ఇచ్చారు.


    First published: