పొలంలో తల్లిదండ్రుల కూలి పని.. పొదల్లోకి తీసుకెళ్లి బాలిక హత్య.. ఆపై అత్యాచారం

బాలిక చనిపోయిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు పనిచేస్తున్న పొలానికి 600 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

news18-telugu
Updated: April 28, 2019, 7:52 PM IST
పొలంలో తల్లిదండ్రుల కూలి పని.. పొదల్లోకి తీసుకెళ్లి బాలిక హత్య.. ఆపై అత్యాచారం
(నమూనా చిత్రం)
news18-telugu
Updated: April 28, 2019, 7:52 PM IST
ఉత్తరాఖండ్‌లో అత్యంత దారుణ ఘటన జరిగింది. ఓ సెక్యూరిటీ గార్డ్ ఆరేళ్ల బాలికను హత్య చేసి, ఆపై ఆమె మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. ఉత్తరాఖండ్‌లోని శ్యాంపుర ప్రాంతంలో ఓ తల్లిదండ్రులు తమ ఆరేళ్ల కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 26 నుంచి కనిపించడం లేదని తెలిపారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు.. శ్యాంపుర గ్రామానికి పొరుగున ఉన్న చిడియార్‌పూర్‌కు చెందిన సోను అనే సెక్యూరిటీ గార్డ్ ఆ బాలికను కిడ్నాప్ చేసిన హత్యాచారం చేసినట్టు గుర్తించారు. అక్కడి ఓ పౌల్ట్రీ ఫామ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సోనుకు ఆరేళ్ల బాలిక ఆడుకుంటూ కనిపించింది. ఆమె తల్లిదండ్రులు పక్కనే పొలాల్లో పనిచేసుకుంటున్నారు. పిల్లలతో కలసి ఆడుకుంటుందన్న ఆలోచనతో వారు తమ పనిలో మునిగిపోయారు. అయితే, ఆ బాలికను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లాడు. ఆమెపై లైంగికదాడి చేయడానికి ప్రయత్నించడగా బాలిక గట్టిగా కేకలు పెట్టింది. దీంతో భయపడిన సోను ఆమెను చంపేశాడు. బాలిక చనిపోయిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు పనిచేస్తున్న పొలానికి 600 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

First published: April 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...