ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న కరెంట్ తీగ

ఆరేళ్ల బాలుడు మూసీన్ అందరి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. అక్కడ ఉన్న కరెంట్ ఫోల్‌ను పట్టుకున్నాడు. అంతే ఇక మూసీన్ కదల్లే, మెదల్లేదు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 3:46 PM IST
ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న కరెంట్ తీగ
విద్యుత్ షాక్ తగిలి ఆరేళ్ల చిన్నారి మృతి
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 3:46 PM IST
హైదరాబాద్‌ బండ్లగూడలో విషాదం చోటు చేసుకుంది. పెబెల్ సిటీలో పిల్లలతో అందరితో కలిసి ఆడుకుంటున్న చిన్నారిని కరెంట్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఆరేళ్ల బాలుడు మూసీన్ అందరి పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు. అక్కడ ఉన్న కరెంట్ ఫోల్‌ను పట్టుకున్నాడు. అంతే ఇక మూసీన్ కదల్లే, మెదల్లే. అక్కడున్నవారెవరూ దీన్ని గమనించలేకపోయారు. కొన్నిక్షణాల పాటు అలాగే ఉండిపోయిన మూసీన్ కాసేపటి తర్వాత అక్కడే కుప్పకూలిపోయాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని విద్యుత్ అధికారులు ప్రకటించారు. మరోవైపు కాలనీ వాసులు మాత్రం ఆందోళనకు దిగారు. పెబెల్ సిటీ సొసైటీ సభ్యుల నిర్లక్ష్యమే పసిప్రాణాన్ని బలితీసుకుందని విమర్శించారు. మరోవైపు మూసీన్ తల్లిదండ్రులు తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. మూసీన్ తండ్రి నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కన్నకొడుకును కరెంట్ షాక్ బలితీసుకోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...