Car falls into ravine : సిక్కిం(Sikkim)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రముఖ పర్యటక ప్రదేశమైన లాచుంగ్‌కు 13 కిలోమీటర్ల దూరంలోని కెదుంగ్ భిర్ ప్రాంతంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు, వారి డ్రైవర్ సిక్కింలో జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను సురేష్ పునమియా, తురల్ పునమియా, హీరాల్ పునమియా, దేవాన్షి పునమియా, జయన్ పరిమార్, డ్రైవర్ సోమి విశ్వకర్మగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
సెలవుల నేపథ్యంలో వీరంతా సిక్కిం రాష్ట్రానికి వచ్చారని పోలీసులు తెలిపారు. సిక్కిం రాజధాని గాంగ్టక్ నుంచి లాచుంగ్‌కు వెళ్తున్న సమయంలో వాహనం స్కిడ్ అయి.. వందల అడుగుల లోతైన లోయలోకి పడిపోయిందని చెప్పారు. సైన్యం, స్థానికుల సహకారంతో పోలీసులు ఆదివారం మృతదేహాలను వెలికితీశారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ALSO READ India-Bangladesh Bus Service : భారత్ -బంగ్లాదేశ్ మధ్య బస్సు..జూన్ 10 నుంచి సర్వీసులు పునరుద్ధరణ
కర్ణాటక నుండి 16 మందితో కూడిన బస్సు అయోధ్యకు వెళ్లున్న సమయంలో యూపీలోని మోతీపూర్ ప్రాంతంలో నానిహా మార్కెట్ వద్ద వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తో సహా ఐదుగురు యాత్రికులు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మోతీపుర్ పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలన్నింటినీ బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని ట్రీట్మెంట్ కోసం జిల్లా హాస్పిటల్ కు తరలించారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రావెలర్ వాహనం ఓవర్‌టేక్ చేస్తుండగా వేగంగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనపై విచారన చేస్తున్నామని ఏఎస్పీ తెలిపారు .ఈ ప్రమాదంలో మరణించిన వారికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Car accident, Sikkim, Six killed