HOME »NEWS »CRIME »6 men gang rape on 13 year old boy over six months and try to forced him to sex change in delhi hsn gh

Rape: మైనర్ బాబుపై గ్యాంగ్ రేప్.. సెక్స్ మార్పిడి ఆపరేషన్.. రంగంలోకి మహిళా కమిషన్.. ఆపై..

Rape: మైనర్ బాబుపై గ్యాంగ్ రేప్.. సెక్స్ మార్పిడి ఆపరేషన్.. రంగంలోకి మహిళా కమిషన్.. ఆపై..
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలోని గీతా కాలనీలో నివాసం ఉంటున్న ఈ 13 ఏళ్ల బాబు ఢిల్లీలోని లక్ష్మి నగర్ లో ఉంటున్న ఓ ముఠాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. డ్యాన్స్ఈవెంట్ లో మైనర్ కు వీరితో పరిచయం కాగా వారు మరిన్ని కొత్త పాటలకు డ్యాన్సులు నేర్పుతామంటూ మరోచోటికి తీసుకెళ్లారు. ఆతరువాత డ్యాన్స్ ఈవెంట్స్ చేసుకుంటున్న మైనర్ కుర్రాడు అంతో ఇంతో డబ్బు సంపాదిస్తున్నాడు.

  • Share this:
అప్పుడప్పుడే టీనేజ్ లో అడుగుపెడుతున్న కుర్రాడిపై కళ్లేసిన గ్యాంగ్ ఆ అబ్బాయి జీవితంతో చెలగాటమాడుకున్న తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్యాన్స్ చేసి ఏదో చిల్లర డబ్బు సంపాదించే ఓ 13 ఏళ్ల కుర్రాడిపై (minor) కళ్లు వేసిన గ్యాంగ్ ఏకంగా ఆ అబ్బాయిని లింగమార్పిడి ఆపరేషన్ కూడా చేయించినట్టు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో (Delhi Police Station) కంప్లైంట్ నమోదైంది. గగుర్పొడిచే ఆ వివరాలు తెలిస్తే సామాన్యులంతా వణికిపోవటం ఖాయం. మనదేశంలో అందునా రాజధాని న్యూఢిల్లీలో చిన్నారులకు ఉన్న రక్షణ ఎంత నామమాత్రమో తాజా ఘటన వివరిస్తోంది. ఢిల్లీలోని గీతా కాలనీలో నివాసం ఉంటున్న ఈ 13 ఏళ్ల బాబు ఢిల్లీలోని లక్ష్మి నగర్ లో ఉంటున్న ఓ ముఠాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. డ్యాన్స్ఈవెంట్ లో మైనర్ కు వీరితో పరిచయం కాగా వారు మరిన్ని కొత్త పాటలకు డ్యాన్సులు నేర్పుతామంటూ మరోచోటికి తీసుకెళ్లారు. ఆతరువాత డ్యాన్స్ ఈవెంట్స్ చేసుకుంటున్న మైనర్ కుర్రాడు అంతో ఇంతో డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే ఇలాగే డ్యాన్స్ చేస్తూ డబ్బు సంపాదించాల్సిందిగా ముఠా నుంచి తీవ్ర ఒత్తిడిలు మొదలయ్యాయి.

హిజ్రాగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద..

ఆతరువాత మూడేళ్లకు వారి చెర నుంచి తప్పించుకుని బయటపడ్డ ఈ మైనర్ కుర్రాడు.. అదృష్టవశాత్తూ పోలీస్ స్టేషన్ చేరుకుని తనను లైంగికంగా, మానసికంగా వేధించిన గ్యాంగ్ పై కేసులు పెట్టాడు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు చెప్పిన వివరాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. బాధితుడు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం మూడేళ్లుగా ఈ గ్యాంగ్ అతనిపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతోంది. అంతేకాదు మత్తు మందులిచ్చి లింగ మార్పిడి ఆపరేషన్ కూడా చేయించి, హార్మోనల్ చికిత్సలు కూడా అందించగా.. ప్రస్తుతం ఈ మైనర్ కుర్రాడు కాస్త అమ్మాయిగా మారినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బలవంతంగా హిజ్రాగా నటిస్తూ డబ్బు సంపాదించి ఆ ముఠాకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక తనపై పదేపదే గ్యాంగ్ రేప్ (gangrape) చేయటమే కాకుండా తనవద్దకు కస్టమర్లను కూడా పంపేవారని మైనర్ వివరించాడు. తన స్నేహితుడిని కూడా ఇలాగే ఉచ్చులోకి దించి, ఇదే చోటికి తీసుకురాగా.. గతేడాది మార్చ్ లో కరోనా లాక్ డౌన్ (lockdown) సమయంలో తామిద్దరూ ఎలాగోలా కామాంధుల నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్టు.. చెప్పాడు. తన తల్లి సాయంతో ఓ గుర్తుతెలియని చోటులో తాను, తన ఫ్రెండ్ అద్దె ఇంట్లో తలదాచుకోవటం తెలుసుకున్న గ్యాంగ్ ఆ ఇంటిని ధ్వంసం చేసి తమను మళ్లీ తీసుకెళ్లినట్టు చెప్పారు.రెండవసారి తప్పించుకుని..

ఆతరువాత మైనర్, తన ఫ్రెండ్ పై మళ్లీ అత్యాచార పర్వం కొనసాగగా.. రెండవసారి తప్పించుకుని న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ చేరుకుని ఓ రోజంతా గడిపారు. వీరిద్దరినీ రైల్వేస్టేషన్లో చూసిన ఓ లాయర్ ఢిల్లీ మహిళా కమిషన్ వద్దకు తీసుకురాగా.. వారి ద్వారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేశారు. పోక్సో (POCSO) చట్టం కింద, ఐపీసీ సెక్షన్ 377, 363, 326, 506, 341 కింద పలు కేసులు నిందితులపై నమోదు చేసి.. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. సంచలనం రేకిత్తిస్తున్న ఈ విషయాలు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుండగా ఢిల్లీ పోలీసులకు ఇప్పుడు ఈ కేసును కొలిక్కి తేవటం పెద్ద సవాలుగా నిలుస్తోంది.
Published by:Hasaan Kandula
First published:January 15, 2021, 18:50 IST