• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 6 KILLED SEVERAL INJURED IN UTTARAKHAND AS FUNERAL VEHICLE FALLS IN GORGE BA

అంత్యక్రియలకు హాజరై.. అనంతలోకాలకు వెళ్లిపోయారు

అంత్యక్రియలకు హాజరై.. అనంతలోకాలకు వెళ్లిపోయారు

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన కుటుంబసభ్యులు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు.

  • Share this:
    ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వారు.. తామే అనంత లోకాలకు వెళ్లిపోతామని ఊహించలేకపోయారు. ఉత్తరాఖండ్‌లో మృతదేహాన్ని స్మశానానికి తీసుకెళ్తున్న వాహనం లోయలో బోల్తా పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. చంపావత్ జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతడిని ఓ వాహనంలో స్మశానానికి తీసుకెళ్తున్నారు. ఆ వాహనంలో బంధువులు కూడా ఎక్కారు. అయితే, ఘాట్ రోడ్డు మధ్యలో స్మశాన వాటిక ఉంది. స్మశానంలో అంత్యక్రియలు ముగించి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం లోయలోకి జారిపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడినట్టు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. అయితే, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు లోయలో పడిపోవడంతో మృతదేహాలను పైకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
    First published: