హోమ్ /వార్తలు /క్రైమ్ /

సినిమా సీన్ ను తలపించేలా అసోం-మేఘాలయ బోర్డర్ లో హింస..ఆరుగురు మృతి

సినిమా సీన్ ను తలపించేలా అసోం-మేఘాలయ బోర్డర్ లో హింస..ఆరుగురు మృతి

అసోం-మేఘాలయ సరిహద్దులో హింస

అసోం-మేఘాలయ సరిహద్దులో హింస

Assam-Meghalaya Border Violence : అసోం-మేఘాలయ బోర్డర్(Assam-Meghalaya Border) లో హింస చెలరేగింది. మంగళవారం తెల్లవారుజామున అసోంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని అసోం-మేఘాలయ సరిహద్దులో జరిగిన హింసలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మరణించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Assam-Meghalaya Border Violence : అసోం-మేఘాలయ బోర్డర్(Assam-Meghalaya Border) లో హింస చెలరేగింది. మంగళవారం తెల్లవారుజామున అసోంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని అసోం-మేఘాలయ సరిహద్దులో జరిగిన హింసలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మరణించారు. అక్రమ కలప రవాణా చేస్తున్న ట్రక్కును అడ్డగించడంతో హింస జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన తరువాత, అసోం పోలీసులు మేఘాలయ సరిహద్దులో ఉన్న అన్ని జిల్లాలలో శాంతిభద్రతల పరిస్థితి స్థిరంగా ఉంచేందుకు అప్రమత్తం చేసినట్లు మరొక అధికారి తెలిపారు.

అసలేం జరిగిందంటే

కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ముక్రు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మేఘాలయలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా వైపు అక్రమ కలపను తీసుకువెళుతున్న ఓ ట్రక్కును అసోం అటవీ శాఖ బృందం అడ్డగించి ఆపివేసినట్లు వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ ఎస్పీ ఇమ్దాద్ అలీ తెలిపారు. అయితే ట్రక్కులోని వారు పారిపోవడానికి ప్రయత్నించగా, ఫారెస్ట్ గార్డులు దానిపై కాల్పులు జరిపి టైర్ గాలిని తీసేశారని తెలిపారు.డఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరిని పారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారని.. మిగిలినవారు పారిపోయారని తెలిపారు.

Tamilnadu: తండ్రి సమాధి కోసం గూగుల్లో సెర్చ్‌ చేసి మలేషియా ప్రయాణం..తమిళనాడు వ్యక్తి ఇంట్రెస్టింగ్ జర్నీ

ఈ ఘటన తర్వాత ఫారెస్ట్ గార్డులు జిరికెండింగ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను పెంచారని తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత మేఘాలయ నుంచి ఆయుధాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉదయం 5 గంటలకు స్పాట్ కు వచ్చి అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫారెస్ట్ గార్డులు, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని ఎస్పీ అలీ తెలిపారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలో మేఘాలయలోని ఖాసీ కమ్యూనిటీకి చెందిన ఓ ఫారెస్ట్ హోంగార్డు, ముగ్గురు వ్యక్తులు మృతి చెందారని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. ఘటన తర్వాత మేఘాలయ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో అసోం పోలీసులు భద్రతను పెంచారు.

First published:

Tags: Assam, Meghalaya

ఉత్తమ కథలు