ట్రక్కును ఢీకొన్న బస్సు... ఆరుగురు మృతి 15మందికి గాయాలు

పూణెకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసేవ్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

news18-telugu
Updated: September 12, 2019, 1:32 PM IST
ట్రక్కును ఢీకొన్న బస్సు... ఆరుగురు మృతి 15మందికి గాయాలు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 12, 2019, 1:32 PM IST
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు... ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా... మరో 15మంది తీవ్రగాయాల పాలయ్యారు. తెల్లవారాజుమన 5గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూణెకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాసేవ్ గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ముంబై నుంచి కర్నాటకలోని బెళగవి జిల్లాకు ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో బయల్దేరింది. అయితే మాసేవ్ గ్రామం వద్దకు వచ్చినప్పుడు ఎదురుగా వస్తున్న ట్రక్కును డ్రైవర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15మంది వరకు గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెల్లవారుజామున సరిగా కనిపించకపోవడంతోనే బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును గమనించలేకపోయాడని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...