తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం ...ఆరుగురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్రమాదంలో వ్యాన్ కూడా నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో వ్యాన్‌లో ఉన్నవారిని సుమారు రెండుగంటలపాటు శ్రమించి బయటకు తీశారు.

  • Share this:
    తమిళనాడలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామాలై వద్ద లారీ వ్యాన్ ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. మరో 31మందికి గాయాలయ్యాయ. వీరిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. కాంచీపురంలో ఓ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. క్షతగాత్రుల్ని చంగల్‌పట్టు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఒకే గ్రామానికి చెందినవారిగా తెలుస్తుంది.

    అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వేగంగా వస్తున్న లారీ... ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వ్యాన్ కూడా నుజ్జు నుజ్జు అయ్యింది. దీంతో వ్యాన్‌లో ఉన్నవారిని సుమారు రెండుగంటలపాటు శ్రమించి బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదం కారణమని పోలీసులు నిర్ధారించారు. లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో మృతుల సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.
    First published: