Home /News /crime /

6 DEAD 12 INJURED IN CALIFORNIA SHOOTING PVN

U.S.A Shooting : అమెరికాలో నరమేధం..ఆగంతకుల కాల్పుల్లో 6గురు మృతి,పలువురికి తీవ్ర గాయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

California Shooting : విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న శబ్దం వినిపిస్తుండగా.. అనేక మంది ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. కాల్పుల శబ్దం విన్న సమయంలో కొద్దరు శరీరంపై రక్తంతో పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు.

ఇంకా చదవండి ...
తుపాకీ సంస్కృతికి పేరుమోసిన అమెరికాలో మరోసారి నరమేధం చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం వేకువజామున 2.30 గంటల సమయంలో కాలిఫోర్నియాలో రద్దీగా ఉండే శాక్రమెంటో ఏరియాలో ఆటోమేటిక్ గన్‌ తో కాల్పులు జరిపి రక్తపాతాన్ని సృష్టించారు. ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు దుర్మరణం చెందినట్టు అధికారులు తెలిపారు. కాగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. . అయితే ఈ కాల్పులకు తెగబడింది ఒకే దుండగుడా? లేక మరికొందరు ఉన్నారా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పులు జరిపిన ప్రాంతం కీలక వేదికలకు సమీపంలో ఉన్నది. శాక్రమెంటో కింగ్స్ బాస్కెట్ బాల్ ఆడే మైదానం గోల్డెన్ వన్ సెంటర్‌ కు ఈ దారి వెళ్తుంది. దేశ క్యాపిటల్ బిల్డింగ్‌యకు మరికొన్ని వీధులకు దూరంలోనే ఈ ఘటన జరిగింది.

విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న శబ్దం వినిపిస్తుండగా.. అనేక మంది ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. కాల్పుల శబ్దం విన్న సమయంలో కొద్దరు శరీరంపై రక్తంతో పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ తరహా నిబంధనలు విధించారు. కాగా, కాల్పులు జరగడానికి ముందు శాక్రమెంటో డౌన్ టౌన్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడినట్టు తెలుస్తోంది. ఇక, ఈ కాల్పుల ఘటన వెనుక ఎవరున్నారు, కారణాలేంటో ఇంకా తెలియలేదు.

కమ్యూనిటీ యాక్టివిస్ట్ బ్యారీ ఆసియస్ మాట్లాడుతూ..ది చాలా దిగ్భ్రాంతికర ఘటన అని తెలిపారు. తాను ఆ ప్రాంతం గుండా వెళ్తుండగా హృదయ విదారక దృశ్యాలు కనిపించాయని పేర్కొన్నారు. చాలా మంది బాధితులు రక్తంతో తడిసిపోయి ఉన్నారని వివరించారు. అరుపులు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగుతున్నదని చెప్పారు. నా సోదరుడు ఎక్కడా? అంటూ ఒకరు, బిడ్డ కోసం తల్లి ఏడుస్తూ వెతుకుతున్న ఘటనలు చూసినట్లు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Died, Gun fire, USA

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు