• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • 6 BANGLADESHI NATIONALS ARRESTED FOR BANGLA GIRL GANG RAPE IN BENGALURU AFTER VIDEO GOES VIRAL SU

బంగ్లా యువతి గ్యాంగ్ రేప్‌ కేసులో కీలక మలుపు.. నిందితుల్లో ఇద్దరు యువతులు.. బాధిత యువతిని ట్రేస్ చేసిన పోలీసులు..

బాధిత యువతిని చిత్రహింసలకు గురిచేస్తున్న నిందితులు

ఓ గ్యాంగ్ రేప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఓ యువతిపై కొందరు అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు చోటుచేసుకుంది.

  • Share this:
    బెంగళూరులో బంగ్లాదేశ్‌కు చెందిన యువతిపై గ్యాంగ్‌రేప్‌ వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ క్రూరమైన చర్యలో నిందితులుగా ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివరాలు.. బెంగళూరులో యువతిని సాముహిక అత్యాచారం చేసిన నిందితులు.. ఆ వీడియోలను అసోం, ఈశాన్య రాష్ట్రాల్లోని తమకు తెలిసిన వారికి షేర్ చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్‌గా మారడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో ఆధారంగా నిందితుల ఫొటోలను అసోం పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారి ఆచూకీ గురించి తెలిసినవారు సమాచారం ఇవ్వాలని కోరారు.

    ఇక, ఈ ఘటన బెంగళూరులో జరిగినట్టు తేలడంతో.. అక్కడి పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నలుగురు యువకులు, ఇద్దరు యువతులను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్‌కు చెందిన హకీల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన సాగర్‌, మహ్మద్‌ బాబా కేశ్‌, రియాద్‌ బాబు, నస్రత్‌, కాజల్‌ను పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు యువతులు.. రియాద్ బాబు భార్యలని పోలీసులు గుర్తించారు. ఇక, నిందితులు రియాద్ బాబు, సాగర్‌లను ఘటన జరిగిన స్థలం మహజరుకు తీసుకెళ్లినప్పుడు వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి కూడా గాయపడ్డాడు. దీంతో నిందితులతో పాటు, పోలీసు అధికారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నిందితులు బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఇంట్లోని వస్తువులను పోలీసులు.. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. నిందితులపై నిర్భయతో పాటు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    నిందితులు తాము ఉంటున్న అద్దె ఇంట్లోనే వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ ఇంట్లో పలువురు యువతులతో వ్యభిచారం చేయించేవారని తేలింది. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో బాధిత మహిళకు, నిందితులకు గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే నిందితులు ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంచానికి కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రైవేటు పార్ట్స్‌పై మద్యం సీసాలతో దాడి చేశారు.

    పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. చివరకు వధువు చెల్లెలితో వరుడి పెళ్లి.. అసలేం జరిగిందంటే

    లేడీ కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఎస్ఐ.. డ్యూటీలో ఉన్న సమయంలో..

    ఇక, ఈ ఘటన జరిగిన అనంతరం బాధిత మహిళ నిందితుల వద్ద నుంచి తప్పించుకుని కేరళలోని కోజికోడ్‌కు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ ఆమెకు పరిచయం ఉన్న మహిళ వద్ద ఆశ్రయం పొందినట్టుగా తెలుసుకున్నారు. ఆమెను బెంగళూరుకు తీసుకొచ్చేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని కేరళకు పంపారు. బాధిత మహిళ బెంగళూరు వచ్చాక పోలీసులు.. ఆమె వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఆమె తెలిపే వివరాలతో.. ఈ కేసుకు సంబంధించి మరింత కీలక సమాచారం బయటపడే అవకాశం ఉంది. ఇక, ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వారికి కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: