అట్లాస్ సైకిల్స్ ఓనర్ భార్య ఆత్మహత్య.. పోలీసుల అనుమానాలు

తన జీవితం పట్ల సంతృప్తి లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో రాసి ఉంది. ఐతే చనిపోయే సమయంలో ఆమె బెడ్‌రూమ్ తెరిచే ఉండడంతో నటాష్ మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Updated: January 22, 2020, 7:09 PM IST
అట్లాస్ సైకిల్స్ ఓనర్ భార్య ఆత్మహత్య.. పోలీసుల అనుమానాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అట్లాస్ సైకిల్స్ సంస్థ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాష్ కపూర్ (57) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయారు. ఆమె సూసైడ్ చేసుకున్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. ప్రాథమిక ఆధారాల ప్రకారంగా ఆమె సూసైడ్ చేసుకున్నట్లు భావిస్తున్నామని చెప్పిన పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.

మధ్యాహ్నం లంచ్ తినేందుకు ఇంట్లో అందరూ డైనింగ్ హాల్‌కు వచ్చారు. ఐతే నటాష్ కపూర్ మాత్రం రాలేదు. దాంతో ఆమె కుమారుడు సిద్దాంత్ కపూర్ ఫోన్ చేశాడు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో హుటాహుటిన నటాష్ గదిలోకి వెళ్లి చూశాడు. ఆమె సీలింగ్ ఫ్యాన్‌ను వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. తన జీవితం పట్ల సంతృప్తి లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో రాసి ఉంది. ఐతే చనిపోయే సమయంలో ఆమె బెడ్‌రూమ్ తెరిచే ఉండడంతో నటాష్ మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, అట్లాస్ సైకిళ్లు అందరికీ సుపరిచితమే. తక్కువ ధరకే అందరికీ నాణ్యమైన సైకిళ్లను అందజేయాలనే ఉద్దేశంతో సంజయ్ కపూర్ తండ్రి జానకి కపూర్ అట్లాస్ సంస్థను 1951లో స్థాపించారు. తొలి ఏడాదిలోనే 12వేల సైకిళ్లను తయారు చేశారు. ఆ తర్వాత 1958లో విదేశాలకు ఎగుమతి ప్రారంభించారు. 1978లో తొలిసారి రేసింగ్ సైకిల్‌ను పరిచయం చేశారు. తండ్రి జానకిదాస్ మరణం తర్వాత అట్లాస్ బాధ్యతలను సంజయ్ కపూర్ చూస్తున్నారు.
First published: January 22, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading