అత్యాచార ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. దేశ రాజధాని ఢిల్లీలో ఓ అత్యాచార ఘటన వెలుగుచూసింది. 55 ఏళ్ల ఓ మహిళపై అత్యాచారం చేసిన 22 ఏళ్ల యువకుడు గొంతు నులిమి ఆమెను హత్య చేశాడు. శనివారం ఉదయం ఢిల్లీలోని గులాబి బాగ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్‌గంజ్ కాలనీకి చెందిన ధర్మరాజ్(22) శుక్రవారం రాత్రి ఆ మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు తన ముఖంపై ఉమ్మినందుకే హత్య చేశానని నిందితుడు ధర్మరాజ్ విచారణలో చెప్పాడు. హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటన మరవకముందే.. దేశంలోని చాలాచోట్ల అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Priyanka reddy murder, RAPE