తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి.. 54 ఏళ్ల కామాంధుడి దారుణం..

అంతా నిద్రపోయాక.. అర్థరాత్రి సమయంలో పక్కింట్లో ఉండే మోహర్ సింగ్.. పాపను ఎత్తుకెళ్లాడు. చిన్నారిపై అతను లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గట్టిగా కేకలు పెట్టింది.

news18-telugu
Updated: September 18, 2019, 8:23 AM IST
తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి.. 54 ఏళ్ల కామాంధుడి దారుణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హర్యానాలో 54 ఏళ్ల ఓ వృద్దుడు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రిపూట తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డట్టు పోలీసులు చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

బాధితురాలి తల్లి కథనం ప్రకారం.. గురుగ్రామ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తమ కుటుంబం నివసిస్తోంది. ఇటీవల ఓరోజు రాత్రి ఇంటి ముందున్న
బాల్కనీలో ఆమె,తన భర్త,కుమార్తె(8) నిద్రించారు. అంతా నిద్రపోయాక.. అర్థరాత్రి సమయంలో పక్కింట్లో ఉండే మోహర్ సింగ్.. పాపను ఎత్తుకెళ్లాడు.

చిన్నారిపై అతను లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గట్టిగా కేకలు పెట్టింది. కుమార్తె అరుపులకు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన తల్లి.. అతని ఇంటివైపు పరిగెత్తగా..అక్కడతను చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటం ఆమె చూసింది. చిన్నారి తల్లి పరిగెత్తుకురావడంతో మోహర్ సింగ్ అక్కడినుంచి పారిపోయాడు. ఆపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>