హైదరాబాద్‌లో మనుషులు మాయమైపోతున్నారు.. అమ్మాయిలే ఎక్కువ.. ఎందుకిలా?

Missing Cases in Telangana: అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్‌ ఉదంతం ఇంకా మరుగునపడకముందే పెరిగిపోతున్న అదృశ్యం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 11:42 AM IST
హైదరాబాద్‌లో మనుషులు మాయమైపోతున్నారు.. అమ్మాయిలే ఎక్కువ.. ఎందుకిలా?
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 11, 2019, 11:42 AM IST
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మనుషులు మాయం అయిపోతున్నారు. హాజీపూర్ ఉదంతం సహా ఎన్నో ఘటనల్లో ఎంతో మంది కనిపించడం లేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. మాయమైపోతున్న వారిలో ఎక్కువ మంది యువతులే కావడం గమనార్హం. ఈనాడు పత్రిక కథనం ప్రకారం.. రాష్ట్రంలో సగటున రోజుకు 60 మంది వరకు అదృశ్యమైపోతున్నారు. ఈ నెలలో 9వ తేది వరకు 545 మంది కనిపించకుండా పోయారు. ఇవి పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులు మాత్రమే. వీరిలో సగం మందికి పైగా రాజధాని పరిసరాలకు చెందిన వారేనట. ఇంతమంది ఎందుకు అదృశ్యమవుతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది బాధితుల కుటుంబ సభ్యులనే కాదు పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

అదృశ్యమవుతున్నవారిలో రెండేళ్ల పసిపిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ ఉంటున్నారు. 18 నుంచి 40 ఏళ్ల వయసువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హతమార్చిన హజీపూర్‌ ఉదంతం ఇంకా మరుగునపడకముందే పెరిగిపోతున్న అదృశ్యం కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెలలో 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలో 545 అదృశ్య కేసులు నమోదయ్యాయట. ఇందులో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లు అంటే రాజధాని పరిధిలోనే 296 మంది కనిపించకుండా పోయారు.

ఎందుకిలా జరుగుతోందంటే..

పరీక్ష ఫలితాల వెల్లడి సమయంలో ఎక్కువగా మిస్సింగ్‌ కేసులు నమోదవుతుంటాయి. ఇలా వెళ్లిన పిల్లల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా తిరిగి వచ్చేస్తుంటారు. ప్రేమ వ్యవహారాలు మరో కారణం. మిస్సింగ్‌ కేసులలో ఎక్కువశాతం ఇలాంటివే ఉంటున్నాయి. ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. కొందరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులమీద అలిగి వెళ్లిపోతుంటారు. మధ్యవయసు వారయితే అప్పులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ఎవరికి చెప్పకుండా వెళ్లిపోతున్నారు. పిల్లలు తమను సరిగా చూడటంలేదని చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోతున్న వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక, బాలికలను, యువతులను, మహిళలను కిడ్నాపర్లు లక్ష్యంగా చేసుకొని ఎత్తుకెళ్తున్నారు.

First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...