మైనర్ బాలికపై తల్లి ప్రియుడి అత్యాచారం.. కృష్ణాలో దారుణం

నిందితుడిని కూడా అదే గ్రామమని.. బాలిక తల్లి సహకారంతోనే అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.

news18-telugu
Updated: December 13, 2019, 10:55 PM IST
మైనర్ బాలికపై తల్లి ప్రియుడి అత్యాచారం.. కృష్ణాలో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ అసెంబ్లీలో దిశ బిల్లు పాసైన రోజే మరో ఘోరం జరిగింది. కృష్ణా జిల్లాలో మైనర్ బాలికపై 56 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. కంచికచర్ల మండలం పరిటాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా.. తల్లి తన మైనర్ కూతుర్ని బలవంతంగా తన ప్రియుడు వద్దకు పంపించింది. తంగిరాల రాంబాబు అనే వ్యక్తి బాలిక తల్లి సాక్షిగా ఒక రాత్రంతా నరకం చూపించాడు. తండ్రి చనిపోవడంతో 14 ఏళ్ల ఆ బాధితురాలు నానమ్మ దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పింది. బాలిక నానమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హైదరాబాద్‌లో దిశా ఘటన తర్వాత మహిళల భద్రత కోసం యావత్ దేశం భగ్గుమంది. ఆడపిల్లలపై చేయి వేసే వారిని నడిరోడ్డుపై చంపేయాలని నినదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడించి.. దోషికి ఉరి శిక్ష వేస్తారు. శుక్రవారం రోజే ఏపీ శాసన సభ దిశ బిల్లుకు ఆమోద ముద్రవేసింది. అది జరిగిన రోజే ఏపీలో ఈ దారుణాలు జరిగాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>