ఆరేళ్ల పసిపాపపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. గుంటూరులో ఘోరం

రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా కూర్చొని పాప ఏడుస్తూ కనిపించింది. జరిగిన విషయాన్ని చెప్పడంతో.. తల్లిదండ్రులు షాక్ తిన్నారు.

news18-telugu
Updated: September 24, 2020, 8:33 AM IST
ఆరేళ్ల పసిపాపపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. గుంటూరులో ఘోరం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చట్టాలంటే లెక్కలేదు. శిక్షలంటే భయం లేదు. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దేశంలో నిత్యం ఏదో మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. మేడికొండూరు మండలం పేరేచర్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరేచర్లకు చెందిన భార్యాభర్తలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. మంగళవారం ఆ చిన్నారి ఆడుకుంటూ పేరేచర్ల జంక్షన్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు. చీకటి పడినా పాప ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

తమ కూతురు కనిపించడం లేదని.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు పేరేచర్లలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని అపహరించి తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఆ తర్వాత ఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఆ క్రమంలో రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా కూర్చొని పాప ఏడుస్తూ కనిపించింది. జరిగిన విషయాన్ని చెప్పడంతో.. తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తలచుకొని వెక్కివెక్కి ఏడ్చారు. ఆ చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని గుంటూరు రూరల్‌ నల్లపాడుకు చెందిన స్వామిగా పోలీసులు గుర్తించారు. చిన్నారికి మాయ మాటలు చెప్పి.. రైల్వే స్టేషన్ సమీపంలోని పొలాల్లోకి అత్యాచారం చేసినట్లు వెల్లడించారు. అనంతరం తిరిగి రైల్వే స్టేషన్‌లో వదలిపెట్టాడని చెప్పారు. ఈ ఘటనలో నిందితుడు స్వామిని అరెస్ట్ చేసి.. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, నిందితుడిని కఠినంగా శిక్షించి.. బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 24, 2020, 8:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading