హోమ్ /వార్తలు /క్రైమ్ /

Burglar Mathew: ఈ దొంగ మాములోడు కాదు.. చోరీలకు సొంత టూల్ కిట్.. దొంగతనం చేసిన డబ్బుతో..

Burglar Mathew: ఈ దొంగ మాములోడు కాదు.. చోరీలకు సొంత టూల్ కిట్.. దొంగతనం చేసిన డబ్బుతో..

Burglar Mathew: ఈ దొంగ మాములోడు కాదు.. చోరీలకు సొంత టూల్ కిట్.. దొంగతనం చేసిన డబ్బుతో..

Burglar Mathew: ఈ దొంగ మాములోడు కాదు.. చోరీలకు సొంత టూల్ కిట్.. దొంగతనం చేసిన డబ్బుతో..

Burglar Mathew: ఈ దొంగ మాములోడు కాదు. ఈ దొంగ గురించి పోలీసులు చెప్పిన వివరాలు ఒక థ్రిల్లింగ్ సినిమా స్టోరీని తలపిస్తున్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

బ్యాంక్ అకౌంట్లో (Bank Account) రూ.లక్షల డబ్బు ఉండి.. స్టాక్‌ మార్కెట్‌ (Stock Market)లో రూ.20 లక్షలతో ట్రేడింగ్‌ చేస్తున్న వ్యక్తి వృత్తి దొంగతనం అంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ దొంగ పేరు జోస్‌ మాథ్యూ(Jose Mathew). కేరళ (Kerala)కు చెందిన ఈ వ్యక్తి మొదటిసారి దొంగతనం చేస్తున్నప్పుడే అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత 30 కేసుల్లో శిక్ష అనుభవించాడు. అయినా అతడి రూటు మారలేదు. దొంగతనాల వృత్తిని కొనసాగించాడు. ఇటీవల మరోసారి పోలీసులకు పట్టుబడిన మాథ్యూ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. స్థానికంగా పెద్దమనిషిగా పేరున్న ఈ వ్యక్తి.. దొంగతనాలు చేసేందుకు సొంతంగా టూల్స్‌ తయారు చేసుకున్నాడు. దొంగతనం చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్నాళ్లు పోలీసులకు చిక్కకుండా తిరిగాడు.

* రూ.20 లక్షలతో ట్రేడింగ్‌

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోస్ మాథ్యూ వందల సంఖ్యలో దొంగతనాలకు పాల్పడ్డాడు. గత వారం కేరళ , పెరుంబవూరులో చోరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఎర్నాకుళం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. 50 ఏళ్ల మాథ్యూ తాను కూడబెట్టిన లక్షల రూపాయల డబ్బును స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశాడు. వివిధ స్టాక్‌లలో రోజుకు రూ.20 లక్షల విలువైన ఇంట్రా-డే ట్రేడింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడు దొంగతనాలనే వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్నాడని, చోరీలు చేయడానికి బానిస అయ్యాడని పేర్కొన్నారు.

* సొంతంగా టూల్ కిట్

జోస్‌ మాథ్యూ చోరీ చేసిన బంగారు ఆభరణాలను కరిగించి విక్రయించేవాడు. అతడు 1992లో వయనాడ్‌లో మొదటిసారి చోరీ చేశాడు. ఈ కేసులో అరెస్టయినా నేరాలు కొనసాగించాడు. ఈ క్రమంలో మాథ్యూ దొంగతనాలు చేసేందుకు వీలుగా 100కి పైగా టూల్స్‌ను సొంతంగా తయారు చేసుకున్నాడు. కారు వైపర్ మోటారుతో తయారు చేసిన డ్రిల్లింగ్ మెషీన్, స్క్రూడ్రైవర్‌లతో, వైపర్ బ్లేడ్‌లతో తయారు చేసిన టూల్స్‌, ఇంకా అనేక రకాల పరికరాలను దొంగతనానికి టూల్ కిట్‌గా ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : వావ్.. మహిళ ఐడియా అదిరింది.. ఉద్యోగం కోసం కేక్‌పై రెజ్యూమ్‌!

* ప్రత్యేక జాగ్రత్తలు

చోరీలకు పాల్పడే సమయంలో మాథ్యూ ఎలాంటి వాహనాలు ఉపయోగించలేదు. దొంగతనం చేయాలనుకుంటున్న చోటుకు చెప్పులు లేకుండానే వెళ్లేవాడు. దీంతో ఆధారాలు ఏవీ లేకపోవడంతోనే చాలా కేసుల్లో ఇతడిని అరెస్టు చేయలేకపోయామని పోలీసులు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇళ్లలో జోస్‌ మాథ్యూ చోరీలకు పాల్పడ్డాడు. గత 20 ఏళ్లలో 7 కిలోలకు పైగా బంగారు ఆభరణాలను దొంగిలించాడు. గతంలో 30 కేసులలో జైలు శిక్ష కూడా అనుభవించాడు. మాథ్యూ ఆర్థికంగా బలంగా ఉన్న ఇళ్లలోనే నేరాలకు పాల్పడేవాడు. పగటిపూట సాధారణ జీవితం గడిపేవాడు. అతడు స్థానికులకు చేపల పెంపకం దారుడిగా పరిచయం చేసుకున్నాడు. దీంతో మాథ్యూపై ఇన్నాళ్లూ ఎవ్వరికీ అనుమానం రాలేదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Crime news, Kerala, Robbery, VIRAL NEWS

ఉత్తమ కథలు