దారుణం.. మేకను దొంగిలించాడని కొట్టి చంపారు..

మేకను దొంగతనం చేస్తున్నాడని కేకలు వేయడంతో.. చుట్టుపక్కల ప్రజలు కూడా అక్కడి వచ్చారు. అందరూ కలిసి అతడిని చావబాదారు. వదలిపెట్టమని.. కాళ్లా వేళ్లాపడినా.. కనికరించలేదు.

news18-telugu
Updated: June 5, 2020, 10:02 PM IST
దారుణం.. మేకను దొంగిలించాడని కొట్టి చంపారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మేకను దొంగిలించేందుకు ప్రయత్నించాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టిచంపారు. అందరూ కలిసి దారుణంగా హత్య చేశారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారిపాదా పట్టణానికి చెందిన 50 ఏళ్ల అభి కలాండి అనే వ్యక్తి పాలాబాని చంచా ప్రాంతంలో ఓ మేకను ఎత్తుకెళ్తుండగా స్థానికులు చూశారు. మేకను దొంగతనం చేస్తున్నాడని కేకలు వేయడంతో.. చుట్టుపక్కల ప్రజలు కూడా అక్కడి వచ్చారు. అందరూ కలిసి అతడిని చావబాదారు. వదలిపెట్టమని.. కాళ్లా వేళ్లాపడినా.. కనికరించలేదు. ఇష్టానుసారం కొట్టడంతో తీవ్ర గాయాలపాలై అభి కలాండి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం అతడి మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన విసిరేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మూకదాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
First published: June 5, 2020, 10:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading