Home /News /crime /

50 PEOPLE KILLED IN SHOOTING AT CHURCH IN NIGERIA PVN

Shooting at church : చర్చిలో కాల్పులు..50మంది మృతి!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Shooting at church : ఆఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో కాల్పులు కలకలం రేపాయి. నైజీరియాలోని నైరుతి ప్రాంతం ఓండో రాష్ట్రంలోని సెయింట్​ ఫ్రాన్సిస్​ క్యాథలిక్​ చర్చ్​లో ఆదివారం ప్రార్థనలు చేస్తుండగా దుండగుడు ప్రవేశించి దాడి చేశాడు.

Shooting at church : ఆఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో కాల్పులు కలకలం రేపాయి. నైజీరియాలోని నైరుతి ప్రాంతం ఓండో రాష్ట్రంలోని సెయింట్​ ఫ్రాన్సిస్​ క్యాథలిక్​ చర్చ్​లో ఆదివారం ప్రార్థనలు చేస్తుండగా దుండగుడు ప్రవేశించి దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కనిపించిన వాళ్లను కనిపించినట్లుగా తుపాకీతో కాల్పులు జరిపి గన్ మెన్ మారణహోమం చేశాడు. కాల్పులు జరపడంతో పాటు ఆ గన్‌మెన్ బాంబులతో సైతం చర్చిలోని వారిపై దాడికి పాల్పడ్డాడు. కాల్పులు, బాంబులు విసరటం వల్ల పలువురు చిన్నారులు సహా 50 మంది వరకు మరణించి ఉంటారని స్థానిక శాసనసభ్యుడు ఒలువోల్‌ చెప్పారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాల్పుల జరిగిన అనంతరం పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని గాయపడిన వారితో పాటు మృతదేహాలను స్థానికంగా ఉన్న సెయింట్ లూయిస్ క్యాథలిక్ హాస్పిటల్‌కు తరలించారు. నైజీరియా ఇస్లాం ఉగ్రవాదంతో బాధపడుతుండగా.. దేశంలో శాంతియుత రాష్ట్రంగా ఓండో ప్రసిద్ధి చెందింది. ఓండో చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదని ఒలువోల్‌ చెప్పారు.

ALSO READ Survey: సోషల్ మీడియా,వీడియో గేమ్‌లతో పిల్లలకు తెలివితేటలు!

దుండగుడు జరిపిన కాల్పులలో భారీగా ప్రాణనష్టం సంభవించిన ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై కాల్పులు జరపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయనీయమైన ఘటన అన్నారు. ఓండో రాష్ట్ర పోలీస్ అధికారి ఫన్మిలాయో ఇబుకం ఒడున్‌లమి మాట్లాడుతూ.. సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిని లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని తెలిపారు. సాధారణంగా నార్త్ వెస్ట్ నైజీరియాలో సాయుధ దాడులు, కిడ్నాప్ లాంటివి అధికంగా జరుగుతాయని, అయితే అనూహ్యంగా సౌత్ వెస్ట్ నైజీరియాలో ఈ ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసిందన్నారు. కాల్పుల ఘటన, మారణహోమం గురించి తెలుసుకున్న ఓండో స్టేట్ గవర్నర్ అరాకురిన్ ఒలువరోటిమి రాజధాని అబుజా పర్యటను అర్ధాంతరంగా ముగించుకుని ఓండోకు తిరిగివచ్చారు. ఈ దారుణానికి పాల్పడ్డవారిని వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు.

మరోవైపు, ఇటీవల దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్​కోర్ట్​ నగరంలో కింగ్స్ అసెంబ్లీ చర్చి స్థానిక పోలో క్లబ్​లో డొనేషన్ డ్రైవ్ నిర్వహించగా,తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆహారం, బహుమతులు తీసుకునేందుకు అంచనాలకు మించి వందల మంది తరలివచ్చారు. చాలామంది తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. అయితే, ఎంతసేపటికీ తమ వంతు రాకపోవడం, జనం పెరిగిపోవడంతో తోపులాట జరిగింది.చాలా మంది గేట్లు పగులగొట్టుకుని లోపలికి చొచ్చుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 31 మంది మరణించారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Kills, Nigeria, Shooting

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు