ఏపీలో దారుణం.. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం

అభం, శుభం తెలియని చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఓడిగట్టాడు.

news18-telugu
Updated: November 26, 2020, 8:08 AM IST
ఏపీలో దారుణం.. ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అభం, శుభం తెలియని చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఓడిగట్టాడు. ఈ ఘటన తూర్పగోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు.. బాలిక తల్లి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటుంది. బాలిక తన తండ్రి, అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి కాకినాడలోనే ఉంటుంది. బాలిక తండ్రి ఇక్కడే కూలీ పనులకు వెళ్తుండేవాడు. ఇక, ప్రతి రోజులాగే చిన్నారి మంగళవారం రాత్రి అమ్మమ్మ వద్ద నిద్రించింది. అయితే అర్ధరాత్రి సమయంలో అంతా నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి బాలికను అపహరించాడు. అనంతరం బాలికను సమీపంలోని శ్మశానవాటిక వద్ద ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం పాపను అక్కడే వదిలేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చిన్నారి ఒంటిపై బట్టలు లేకుండా రక్తపు మరకలతో ఉన్న చిన్నారిని స్థానికులు గుర్తించారు.

అదే సమయంలో నిద్రలేచేసరికి బాలిక కనిపించకపోవడంతో జాడ కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు స్థానికులు ఆమెను అప్పగించారు. దీంతో వెంటనే వారు బాలికను జీజీహెచ్ తరలించారు. అయితే ఎంఎల్‌సీ తీసుకొస్తే వైద్యం చేస్తామని చెప్పడంతో బాలిక కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ రామ్మోహన్ ఆస్పత్రి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైద్యులు బాలికకు చికిత్స ప్రారంభించారు. దీనిపై జీజీహెచ్ సూపరింటెండెట్ రాఘవేంద్రరావును స్పందిస్తూ.. బాలికను ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో పిల్లల వైద్యుడు, మత్తు డాక్టర్ వేరే శస్త్రచికిత్సలో ఉండటంతో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. వెంటనే వైద్య సేవలు అందించామని పేర్కొన్నారు.

మరోవైపు ఈ దారుణ ఘటనపై కాకినాడ్ వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఆస్పత్రిలో బాలికను పరామర్శించారు.
Published by: Sumanth Kanukula
First published: November 26, 2020, 8:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading