HOME » NEWS » crime » 5 YEARS OLD BOY CRUSHED TO DEATH AFTER STUCK IN LIFT AT MUMBAI DHARAVI SU

Lift Accident: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలుడి మృతి.. కుటుంబంలో తీవ్ర విషాదం

ముంబైలోని ధారవిలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో ఓ ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. లిఫ్ట్ చిక్కుకున్న చిన్నారి ప్రాణాలు కోల్పోవడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

news18-telugu
Updated: November 29, 2020, 12:45 PM IST
Lift Accident: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి ఐదేళ్ల బాలుడి మృతి.. కుటుంబంలో తీవ్ర విషాదం
లిఫ్ట్‌లో చిక్కుపోయిన బాలుడు(Image-ANI)
  • Share this:
ముంబైలోని ధారవిలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో ఓ ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. లిఫ్ట్ చిక్కుకున్న చిన్నారి ప్రాణాలు కోల్పోవడం.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. ధారవి ప్రాంతంలోని షాహు నగర్‌లోని ఓ బిల్డింగ్‌లో నివాసం ఉంటున్న ఐదేళ్ల చిన్నారి హుజైఫ్ సర్పరాజ్ షేక్ మిగతా పిల్లలతో కలిసి శనివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో నాలుగో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంటికి వెళ్లడం కోసం లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ నాలుగో ఫ్లోర్‌కు చేరుకోగానే మిగతా పిల్లలు లిఫ్‌లో నుంచి బయటకు వచ్చేశారు. అయితే షేక్ బయటకు దిగుతున్న సమయంలోనే లిఫ్ట్ బయటి గ్రిల్స్ మూసుకుపోయాయి. దీంతో లోపలి, బయట డోర్‌కు మధ్య షేక్ చిక్కుకుని పోయాడు. అదేసమయంలో లిఫ్ట్ కిందకు వెళ్లడంతో అతడు నలిగిపోయాడు.

అయితే లిఫ్ట్‌ వద్ద షేక్ మృతదేహాన్ని గుర్తించిన అక్కడివారు అతడి తండ్రి సర్పరాజ్‌కు సమాచారం అందించారు. అలాగే బాలుడిని ఆస్పత్రికి తరలించాడు. ట్రైలర్‌గా పనిచేసే సర్పరాజ్ వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న షేక్ మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.



ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు యాక్సిడెంటల్ డెత్‌గా రిపోర్ట్ ఫైల్ చేశారు. అలాగే మెకానికల్‌గా లిఫ్ట్‌ పనితీరులో ఏమైనా సమస్య ఉంద అనే విషయాన్ని కూడా ఆరా తీసుకున్నారు. ఆ ప్రాంతలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. గతంలో లిఫ్ట్ వల్ల అక్కడివారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయ అనే విషయంపై కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Published by: Sumanth Kanukula
First published: November 29, 2020, 12:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading