పాపం పసివాడు...స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి

గేటెడ్ కమ్యూనిటి వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయారంటున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: June 15, 2019, 9:28 PM IST
పాపం పసివాడు...స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి
స్విమ్మింగ్ పూల్‌లో పడి ఐదేళ్ల బాలుడు మృతి
news18-telugu
Updated: June 15, 2019, 9:28 PM IST
హైదరాబాద్ శివారులోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్విమ్మింగ్ పూల్‌లో పడి 5 ఏళ్ల బాలుడు చనిపోయాడు. మంజీర డైమండ్ టవర్స్‌లో ఈ ఘోరం జరిగింది. వశిష్ట అనే బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పూల్‌లో పడిపోయాడు. అక్కడుండే వారు గమనించే లోపే అతడు నీటిలో మునిగి చనిపోయాడు. ఐతే గేటెడ్ కమ్యూనిటి వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయారంటున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...