5-Year-Old Girl Raped : పంజాబ్ లో ఘోరం జరిగింది. కపుర్తలా జిల్లాలో ఐదేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో స్వీట్లు ఆశచూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుని బీహార్ కు చెందిన వలస కార్మికుడు మహమ్మద్ సౌరవ్ గా గుర్తించినట్టు కపుర్తలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హరీష్ దమియ మంగళవారం తెలిపారు.
బాలిక తల్లిదండ్రులు కూడా వలస కార్మికులే కావడంతో పనివేళలు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఆ వెంటనే జరిగిన విషయం బాలిక చెప్పడంతో పాప తల్లి ఫత్తు థింగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Child rape, Punjab