Telangana: పతంగులు ఆట కోసం బయటకు వెళ్లిన బాలుడు.. ఇంటి ముందు మురుగు కాల్వలో శవమై తేలాడు..

ప్రతీకాత్మక చిత్రం

సంక్రాంతి పండగ వేళ ఓ ఇంటిలో విషాదం చోటుచేసుకుంది. పతంగులు ఎగరవేయడానికి బయటకు వెళ్లిన ఓ బాలుడు.. ఇంటి ముందు మురుగు కాల్పలో శవమై తేలాడు.

  • Share this:
    సంక్రాంతి పండగ వేళ ఓ ఇంటిలో విషాదం చోటుచేసుకుంది. పతంగులు ఎగరవేయడానికి బయటకు వెళ్లిన ఓ బాలుడు.. ఇంటి ముందు మురుగు కాల్పలో శవమై తేలాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన నిశాంత్(5) అనే బాలుడు గురువారం మధ్యాహ్నం పతంగులు ఎగరవేస్తూ, ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం బయటకు వెళ్లిన తమ కుమారుడు చాలా సేపటికీ కూడా ఇంటికి రాకపోవడంతో నిషాంత్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. నిషాంత్ ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఇంటి ముందు మురుగు కాల్వలో నిషాంత్ మృతదేహం కనిపించింది. ఇది చూసిన నిషాంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

    ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడు ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడా? లేక ఎవరైనా తోసేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు మురుగు కాల్వలో నిషాంత్ శవంగా తేలడంతో దేవునిపల్లి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: