నలుగురు కుటుంబ సభ్యులను కాల్చి...తానూ ఆత్మహత్య

ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడల్ నోట్ లభించకపోవడతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేశారు. ఆర్థిక సమస్యలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

news18-telugu
Updated: August 16, 2019, 2:58 PM IST
నలుగురు కుటుంబ సభ్యులను కాల్చి...తానూ ఆత్మహత్య
ప్రతికాత్మక చిత్రం
  • Share this:
కర్నాటకలోని చామరాజనగర్‌లో దారుణం జరిగింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చి..ఆ తర్వాత తానూ కాల్చుకున్నాడు. గర్భంతో ఉన్న భార్య, బాబుతో పాటు తల్లిదండ్రులను చంపేశాడు. మైసూరు సమీపలోని గుండుల్‌పే‌ట్‌లో ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓమ్ ప్రకాశ్ (38) అనే వ్యక్తి మైసూరులో వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం భార్య నికిత (30), కుమారుడు ఆర్య (4), తల్లిదండ్రులు నాగరాజు (65), హేమ రాజు (60)లను ఓంప్రకాశ్ తుపాకీతో కాల్చి అనంతరం తానూ కాల్చుకున్నాడు.

ఓం ప్రకాశ్ ఫ్యామిలీ కొద్ది రోజుల క్రితం ఊరు వదిలి బందిపోరాలోని యేలచెట్టి గ్రామంలో ఉన్న ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట సమీపంలోని ఓ లాడ్జికి వెళ్లి..మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం గుండ్లుపేట శివారు ప్రాంతానికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడల్ నోట్ లభించకపోవడతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేశారు. ఆర్థిక సమస్యలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.


First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>