ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్... ఐదుగురు మావోయిస్టులు హతం

ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మావోలు కాల్పులు జరుపుతూ పారిపోయారు

news18-telugu
Updated: August 24, 2019, 1:16 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్... ఐదుగురు మావోయిస్టులు హతం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఛత్తీస్ గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అటవీప్రాంతంలో మరోసారి మావోలు, పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయణ్ పూర్ జిల్లాలో మావోయిస్టుల అలికిడిపై భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన బలగాలు భారీఎత్తున కూంబింగ్ చేపట్టాయి. నారాయణ్ పూర్ అటవీప్రాంతంలో భద్రత బలగాలు ఉన్నారన్న సమాచారం గ్రహించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మావోలు కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ  కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇంకా అటవీ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

దాదాపు 90 నిమిషాల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు డీజీపీ డీఎం అవాస్తి వివరించారు. ఇక ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత పోలీసులు ఘటనా స్థలంలో ఐదు మంది మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు డీజీపీ తెలిపారు. మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్ మధ్య అభుజ్‌మద్ అడవులు విస్తరించి ఉన్నాయి.బ్రిటీష్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు 6వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న దట్టమైన అడువుల్లో సర్వే చేయలేదు.
First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading