హోమ్ /వార్తలు /క్రైమ్ /

పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 5 గురు దుర్మరణం.. మరో 10 మంది..

పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 5 గురు దుర్మరణం.. మరో 10 మంది..

ప్రమాదం జరిగిన ప్రదేశం

ప్రమాదం జరిగిన ప్రదేశం

Bihar: బాణాసంచాను తయారుచేసే ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం సంభవించింది. అక్కడ పనిచేస్తున్న ఐదుగురు కార్మికులు విగత జీవులుగా మారిపోయారు.

బీహర్ లో  (Bihar) ఘోర ప్రమాదం సంభవించింది. సరన్ జిల్లాలోని ఖోదైబాగ్ గ్రామంలో ఆదివారం బాణసంచా ఫ్యాక్టరీలో (Fire accident)  ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ.. పదుల సంఖ్యలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో భయంతో కార్మికులు పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదం జరగిన తర్వాత..  ఐదుగురు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు.

మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో పది మంది ప్రమాదంలో చిక్కుకుని ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అధికారుల ప్రకారం.. షబీర్ హుస్సేన్ అనే వ్యక్తి తన ఇంట్లోనే.. అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనతో కార్మికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అధికారులు పెద్ద ఎత్తును ఫైరింజన్లకు, అంబులెన్స్ లను ఘటన స్థలానికి తరలించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఇదిలా ఉండగా గతంలో హైదరాబాద్ లోను  అగ్ని ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది. సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గౌడౌన్‌ (Bhoiguda Scrap godown fire accident) లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాటిని అదుపుచేసేందుకు 8 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్‌లో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ గోడౌన్ రెండతస్తుల్లో ఉంది. పై అంతస్తులో కార్మికులు అర్ధరాత్రి వరకు పనిచేసిన తర్వాత.. అక్కడే నిద్రపోయారు. వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కింది అంతస్తు నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కిందకు వెళ్లేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు.. ఒకే మార్గం ఉండడం.. అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. కార్మికులు ఎటూ వెళ్లలేకపోయారు. పై అంతస్తులోనే ఉండిపోయి.. అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Fire Accident

ఉత్తమ కథలు