బాయిలర్‌లో పేలుడు.. ఐదుగురు కార్మికులు దుర్మరణం...

మహారాష్ట్రలోని బేలా గ్రామంలో ఉన్న బయో గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది.

news18-telugu
Updated: August 1, 2020, 8:35 PM IST
బాయిలర్‌లో పేలుడు.. ఐదుగురు కార్మికులు దుర్మరణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలోని నాగపూర్‌ జిల్లాలో ఘోరం జరిగింది. మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్‌లో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు చనిపోయారు. బేలా గ్రామంలో ఉన్న బయో గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంగేష్ ప్రభాకర్ (21), లీలాధర్ షిండే (42), వాసుదేవ్ లాడీ (30), సచిన్ ప్రకాష్ (24), ప్రఫుల్ మూన్ (25) ప్రాణాలు కోల్పోయారు. అందరూ సమీపంలోని వాడ్ గావ్ గ్రామస్తులు. వారిలో సచిన్ ప్రకాష్ వెల్డర్, మిగిలిన వారు అందరూ హెల్పర్లు. ప్లాంట్‌లో పేలుడు సంభవించడానికి ముందు దట్టమైన పొగ వచ్చింది. ఘటనలో అందరూ అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ రాకేష్ ఓలా ఘటన స్థలాన్ని పరిశీలించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 1, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading