హోమ్ /వార్తలు /క్రైమ్ /

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్ ను ఢీకొట్టిన బొలేరో... ఐదుగురు మృత్యువాత...

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్ ను ఢీకొట్టిన బొలేరో... ఐదుగురు మృత్యువాత...

రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనం

రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనం

Delhi: బంధువులతో కలిసి చనిపోయిన వారి తాతయ్య.. చితాభస్మాన్ని హరిద్వార్ లో నిమజ్జనం చేశారు. ఆ తర్వాత బోలేరో వాహానంలో తిరుగుపయనమయ్యారు. ఇంతలో ఘోరం జరిగింది.

ఢిల్లీ, జైపూర్ హైవేపై (Delhi jaipur) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్ ను బోలేరో ఢీకొట్టింది. ఈ ఘటన జరగ్గానే బొలేరో ఉన్న వారు ఎగిరిపడ్డారు. అక్కడ పరిస్థితి అంతా భయానకంగా మారిపోయింది. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ ప్రాంతంలోని రోడ్డంతా రక్త సిక్తంగా మారింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. బోలేరో బలంగా లో 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.


తమ ఇంటి పెద్ద చితా భస్మాన్ని హరిద్వార్ లో (road accident) కలపడానికి కుటుంబమంతా కలసి ప్రత్యేక వాహనంలో వెళ్లారు. ఆ తర్వాత.. జైపూర్ కు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో.. తిరుగు ప్రయాణం చేసేటప్పుడు..  ఢిల్లీ, జైపూర్ హైవే మీద దారుణం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బొలేరో , ఆగిఉన్న ట్రక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కత గాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదకరంగా మారిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Road Accident in Yemmiganur:  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగాయి.

నిత్యం ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా (Kurnool District)లో దారుణం జరిగింది. ఎమ్మిగనూరు మండలంలో కారు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఎక్కువగా నీరు ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న వాహనాన్నిూ ఓవర్‌టేక్ చేయబోయిన కారు.. అదుపుతప్పి బావిలోకి పడిపోయింది. ఎమ్మిగనూరు మండలం ఎర్ర కోట గ్రామ దగ్గర ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. హ్యూందాయ్ క్రెటా కారు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు మీదుగా వెళ్తోంది.

ఎర్రకోట గ్రామం సమీపంలో ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భంలో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అలా పక్కనే ఉన్న బావిలోకి పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బావిలో పుష్కలంగా నీరు ఉండటంతో కారును గుర్తించడం కాస్త సమస్యగా మారింది. ఇది గమనించిన స్థానిక ప్రజలు.. 100 కు డయల్  చేసి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బావిలో పడిపోయిన కారును బయటకు తీశారు. కనిపించకుండాపోయిన కారు కోసం గజ ఈతగాళ్లు పోలీసుల సహకారంతో రంగంలోకి దిగారు.

First published:

Tags: Delhi, Road accident

ఉత్తమ కథలు