జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

ఇద్దరు ఉగ్రవాదులు ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరిపినట్టు తెలిసింది. ఓ వైపు కాల్పులు జరుపుతూ మరోవైపు గ్రెనేడ్లు కూడా విసిరినట్టు తెలిసింది.

news18-telugu
Updated: June 12, 2019, 7:35 PM IST
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
పుల్వామా దాడి
news18-telugu
Updated: June 12, 2019, 7:35 PM IST
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో భద్రతా బలగాల మీద కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. రద్దీగా ఉండే కేపీ రోడ్డులో పోలీస్ పార్టీ మీద మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో మరో 12 మంది కూడా గాయపడినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. అనంతనాగ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అర్షద్ అహ్మద్ కూడా ఈ దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఉగ్రవాదులు ఆటోమేటిక్ రైఫిల్స్‌తో కాల్పులు జరిపినట్టు తెలిసింది. ఓ వైపు కాల్పులు జరుపుతూ మరోవైపు గ్రెనేడ్లు కూడా విసిరినట్టు తెలిసింది.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...