హోమ్ /వార్తలు /క్రైమ్ /

Inmates Died : ఖైదీల మధ్య ఘర్షణ..అగ్నిప్రమాదం జరిగి జైలులోనే 49మంది మృతి!

Inmates Died : ఖైదీల మధ్య ఘర్షణ..అగ్నిప్రమాదం జరిగి జైలులోనే 49మంది మృతి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fight In orision : నైరుతి కొలంబియాలో జైలు నుండి తప్పించుకునే ప్రయత్నంలో మంగళవారం తెల్లవారుజామున కనీసం 49 మంది ఖైదీలు  మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు.

Fight In orision : నైరుతి కొలంబియా(Colombia)లో జైలు(Jail) నుండి తప్పించుకునే ప్రయత్నంలో మంగళవారం తెల్లవారుజామున కనీసం 49 మంది ఖైదీలు  మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. కొలంబియాలోని తులువా నగరంలో జైలులో మంగళవారం తెల్లవారుజామున ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. జైల్లో అల్లర్లు జరుగుతున్న సమయంలోనే మంటలు చెలరేగయని నేషనల్​ ప్రిజన్​ సిస్టమ్​ డైరెక్టర్​ టిటో కాస్టెల్లనోస్ తెలిపారు. ఈ మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే ఈ విషాదం సంభవించిందని తెలిపారు.

ఖైదీల గొడవే ప్రమాదానికి కారణమని తెలిపారు. అయితే చనిపోయినవారందరూ ఖైదీలా.. కాదా అనేది స్పష్టత లేదని తెలిపారు. బాధితుల బంధువులకు తన సంఘీభావం తెలియజేస్తూ కొలంబియా అధ్యక్షుడు ట్వీట్ చేశారు. జైలులో జరిగిన సంఘటనలకు మేము చింతిస్తున్నట్లు పదవీవిరమణ చేస్తున్న అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తెలిపారు. అయితే మరణాల సంఖ్య గురించిన వివరాలను అధ్యక్షుడు తెలియజేయలేదు.


Curry Leaves: కరివేపాకా మజాకా..కరివేపాకు వద్దనుకుంటే ఈ లాభాలు మిస్ అయినట్లే!

కొలంబియా పొరుగున ఉన్న ఈక్వెడార్‌లో.. 2021 ప్రారంభం నుండి ఇప్పటివరకు పలు జైళ్లలో ఆరుసార్లు జరిగిన అల్లర్లలో దాదాపు 400 మంది ఖైదీలు మరణించారు.

First published:

Tags: Fire Accident, Fire broke out, Jails

ఉత్తమ కథలు