Home /News /crime /

49 INMATES DIE ATTEMPTING TO BREAK OUT OF COLOMBIA PRISON

OMG: జైలులో ఘోరం.. 49 మంది ఖైదీల దుర్మరణం.. కారణం ఏంటంటే..

కొలంబియాలోని జైలు

కొలంబియాలోని జైలు

Colombia: కొలంబియాలో దారుణ ఘటన జరిగింది. జైలులోని ఖైదీలు పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో.. వారంతా విద్యుత్ షాక్ కు గురయ్యారు.

నైరుతీ కొలంబియాలో (Colombia) దారుణ ఘటన జరిగింది. మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. కొంత మంది ఖైదీలు (Inmates attempt escape) జైలు అధికారుల కళ్లు గప్పి పారిపోవడానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పెద్ద గోడలను ఎక్కారు. అయితే, అక్కడ కొన్ని విద్యుత్ తీగలు ఉన్నాయి. దీన్ని వారు గమనించలేదు. వాటిని పట్టుకున్నారు.దానిలో విద్యుత్ ప్రవాహం జరగటంతో వారు చనిపోయారు. అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే  అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. అక్కడ ఖైదీలు విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే విద్యుత్ ప్రవాహం ఆపించివేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

దాదాపు.. 49 వరకు చనిపోయినట్లు అధికారులుప్రాథమికంగా భావిస్తున్నారు. చనిపోయే వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పదవీవిరమణ చేస్తున్న అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధితుల బంధువులకు తన సంఘీభావం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా గతంలోనే అమెరికాలో కాల్పులు జరిగాయి.

అమెరికా(America)లో తుపాకులు లైసెన్సులు చాలా ఈజీగా దొరుకుతాయి. తుపాకీ హింసను అరికట్టడం కోసం ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ తుపాకీ హింస వల్ల ప్రతిరోజూ అమాయకులు చనిపోతున్నారు. ఇటీవలె మిచిగాన్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 15 ఏళ్ల విద్యార్ధి కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను చంపాడు. గాయపడిన వారిలో 17 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మరిచిపోకముందే అమెరికాలోని హ్యూస్టన్‌ (Houston‌)లో ఆగంతకులు కాల్పులు (Strangers Firing) జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.

స్థానికంగా పండుగ (candlelight vigil)ను పురస్కరించుకుని ఇక్కడకు చేరిన ప్రజలపై ఆదివారం రాత్రి ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఓ అధికారి సమాచారం అందించారు. బేటౌన్ నార్త్ మార్కెట్ లూప్ (North Market Loop in Baytown) సమీపంలో వేడుక కోసం దాదాపు 50 మంది వ్యక్తులు గుమిగూడిన సమయంలో సాయంత్రం 6.40 గంటలకు కాల్పులు జరిగినట్లు హారిస్ కౌంటీ షెరీఫ్ ఎడ్ గొంజాలెజ్ (Ed Gonzalez, head of the Harris County Sheriff’s Office) తెలిపారు.

ఈ ప్రజలు సంబరాలు (candlelight vigil) చేసుకుంటున్నారని మరియు గాలిలో బెలూన్‌లను వదులుతున్నారని, ఒక వాహనం అక్కడికి చేరుకుని గుంపుపైకి కాల్పులు (gunfire against vigil) జరిపిందని అతను చెప్పాడు. మరణించిన వ్యక్తికి సుమారు 20-22 సంవత్సరాల వయస్సు ఉంటుందని గొంజాలెజ్ సోమవారం ఉదయం చెప్పారు. గాయపడిన ముగ్గురిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, South america

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు