Affair: మూడు పెళ్లిళ్లు చేసుకున్నా మోజు తీరక మరో మహిళతో అఫైర్.. అంతటితో కూడా ఆగక.. చెప్పాలంటేనే..

నిందితుడు భారతి

తిరుపత్తూరు జిల్లా వానియంబాడి కామరాజపురం తాలూకాకు చెందిన భారతి(47) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భారతి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్యకు ఒక కొడుకు, ఒక కూతురున్నారు. రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఆమె భారతితో అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయింది. దీంతో.. భారతి మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు.

  • Share this:
    చెన్నై: ఓ వ్యక్తి మహిళతో అక్రమ సంబంధం నడుపుతున్నాడు. అంతటితో ఆగక.. కామోన్మాదంతో ఆమె పదేళ్ల కూతురిపైనా కన్నేశాడు. రోజూ వచ్చీపోయే సమయంలో ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ బాలికను తాకరాని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందేవాడు. ఒకరోజు ఆ బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో ఆ ఇంటికెళ్లి ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తల్లికి చెప్పడం, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి కామరాజపురం తాలూకాకు చెందిన భారతి(47) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. భారతి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్యకు ఒక కొడుకు, ఒక కూతురున్నారు. రెండో వివాహం చేసుకున్నప్పటికీ ఆమె భారతితో అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయింది. దీంతో.. భారతి మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్యకు ఇద్దరు కుమార్తెలు. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నా భారతి అంతటితో ఆగలేదు. తొమ్మిదేళ్లుగా చెన్నై నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అక్కడే జీనత్ అనే ఇద్దరు పిల్లల తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. జీనత్‌‌ పదేళ్ల వయసున్న కూతురు ఉంది. ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న భారతి రోజూ జీనత్ ఇంటికి వెళ్లి ఆమెతో కామక్రీడలు సాగించేవాడు. పిల్లలిద్దరినీ నిద్రపుచ్చి భారతి, జీనత్ మరో గదిలో రాసలీలలు సాగించేవారు. ఇలా తొమ్మిదేళ్ల నుంచి భారతి ఆమెకు ఆర్థికంగా సాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

    కొన్నాళ్లుగా భారతి బుద్ధి మరింత వక్రంగా తయారైంది. జీనత్ పదేళ్ల కూతురిపై భారతి కన్నుపడింది. చిన్న పాప అనే కనీస కనికరం లేకుండా కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తించాడు. జీనత్‌తో రాసలీలలు ముగిశాక.. ఆమె నిద్రించాక.. నిద్రపోతున్న ఆమె కూతురి దగ్గరకు వెళ్లేవాడు. ఆమెకు ముద్దుపెడుతూ ఆ బాలికను తాకరాని చోట తాకుతూ తప్పుతప్పుగా ప్రవర్తించేవాడు. రోజురోజుకూ భారతి పైశాచిక చేష్టలు శృతిమించాయి.

    ఇది కూడా చదవండి: Young Woman: ఎంబీబీఎస్ చదువుతూ ఎంతపని చేశావమ్మా.. ఇంట్లో గోడపై చూడగా ఆ చేదు నిజం తెలిసింది..!

    ఇటీవల.. రోజూలానే జీనత్ ఇంటికి వెళ్లిన భారతి ఆమెతో పడక సుఖం పొందిన తర్వాత.. ఆమె నిద్రించాక పశువులా మారాడు. జీనత్ నిద్రిస్తుండగా ఆమె కూతురిపై నోరు నొక్కి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భారతి పైశాచిక చర్య గురించి ఆ బాలిక తల్లికి చెప్పింది. దీంతో.. భారతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జీనత్ తన కూతురిని భారతి లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల భారతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
    Published by:Sambasiva Reddy
    First published: