Earthquake in indonesia : ఇండోనేషియాలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. సోమవారం మధ్యాహ్నం జావా ద్వీపంలో(Java Island) 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం ధాటికి 46 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. భూకంపం ధాటికి గాయపడ్డ వారిని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూప్రకంపనల కారణంగా పలుచోట్ల ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి.
US జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సియాంజూర్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల (6.2 మైళ్ళు) లోతులో కేంద్రీకృతమై ఉంది. భూకంపం కారణంగా ఇళ్లు సహా డజన్ల కొద్దీ భవనాలు దెబ్బతిన్నాయని సియాంజూర్ జిల్లాలో స్థానిక అధికారులు తెలిపారు. గ్రేటర్ జకార్తా ప్రాంతంలో భూకంపం తీవ్రంగా కనిపించింది. రాజధానిలో ఎత్తైన భవనాలు మూడు నిమిషాలకు పైగా ఊగిసలాడాయి. "భూకంపం చాలా బలంగా అనిపించింది. నా సహోద్యోగులు, నేను తొమ్మిదో అంతస్తులో ఉన్న మా కార్యాలయం నుండి అత్యవసర మెట్లతో బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము" అని దక్షిణ జకార్తాలోని ఉద్యోగి విది ప్రిమధానియా అన్నారు.
Weight Loss : అమెరికా మహిళ.. 62 కేజీల బరువు తగ్గింది.. ఏం చేసిందో తెలుసా?
కాగా,ఇండోనేషియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తాయి. అయితే జకార్తాలో అవి అసాధారణం. ఇండోనేషియా.. 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహం. పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల ఆర్క్ అయిన "రింగ్ ఆఫ్ ఫైర్" పై దాని స్థానం కారణంగా తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీలచే దెబ్బతింటుంది.
ఫిబ్రవరిలో పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల దాదాపు 25 మంది మరణించగా, 460 మందికి పైగా గాయపడ్డారు. జనవరి 2021లో పశ్చిమ సులవేసి ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 100 మందికి పైగా మరణించగా,దాదాపు 6,500 మంది గాయపడ్డారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన శక్తివంతమైన భూకంపం, సునామీ కారణంగా డజను దేశాల్లో దాదాపు 230,000 మంది మరణించారు, వారిలో ఎక్కువ మంది ఇండోనేషియాలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Earth quake, Earthquake, Indonesia