ట్రైన్ టాయిలెట్‌లో ప్రయాణికుడి ఆత్మహత్య...లుంగీతో ఉరేసుకొని...

టాయిలెట్ రూమ్‌లో కొక్కేనికి లుంగీతో ఉరేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐతే అతడి వివరాలు మాత్రం తెలియరాలేదు. సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుందని.. అతని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

news18-telugu
Updated: February 12, 2019, 6:59 PM IST
ట్రైన్ టాయిలెట్‌లో ప్రయాణికుడి ఆత్మహత్య...లుంగీతో ఉరేసుకొని...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 6:59 PM IST
రన్నింగ్ ట్రైన్‌లో ప్రయాణికుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. టాయిలెట్ గదిలోకి వెళ్లి లుంగీతో ఉరేసుకున్నాడు. ఎర్నాకుళం (కేరళ) నుంచి కరైకల్ (పుదుచ్చేరి)కి వెళ్లే టీ గార్డెన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. ఈ రైలు కేరళ నుంచి తమిళనాడు మీదుగా పుదుచ్చేరి వెళ్తుంది. ఎప్పటిలాగే మంగళవారం తమిళనాడులోని కారూర్ స్టేషన్‌కు ఉదయం 05.30కి చేరింది. క్రాసింగ్ ఉండడంతో కాసేపు ఆగింది. ఆ సమయంలో ఓ కంపార్ట్‌మెంట్‌లోని టాయిలెట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు ప్రయాణికులు. కానీ లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఎంత అరిచినా ఎవరూ పలకలేదు. కొన్ని గంటలుగా అదే పరిస్థితి. దాంతో కారూర్ స్టేషన్‌లో రైలు ఆగిన తర్వాత రైల్వేసిబ్బందికి ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకొని అద్దాలు పగులగొట్టి చూడగా..లోపల ఓ వ్యక్తి ఉరేసుకొని ఉన్నాడు. దాంతో ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు.

టాయిలెట్ రూమ్‌లో కొక్కేనికి లుంగీతో ఉరేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐతే అతడి వివరాలు మాత్రం తెలియరాలేదు. సుమారు 45 ఏళ్ల వయసు ఉంటుందని.. అతని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కారూర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన కారణంగా టీగార్డెన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం ఒక గంట ఆలస్యంగా నడిచింది. మరోవైపు టాయిలెట్ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో..రోజువారీ ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...