కూతురిని కంటికి రెప్పలా కపాడాల్సిన తండ్రే తన కూతుళ్ల పాలిట శాపం అయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డలపై దారుణానికి ఒడిగట్టాడు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు.. ఒకటి కాదు, రెండు కాదు.. నాలుగేళ్ల పాటు కూతుళ్లను బలాత్కారం చేశాడో దుర్మార్గుడు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖజ్రానాలో చోటుచేసుకుంది. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేసే ఆ నీచుడు.. 15, 17, 19 ఏళ్ల వయసున్న తన కూతుళ్లను దారుణంగా రేప్ చేశాడు. ఎవరికైనా చెబితే కత్తులతో నరికేస్తానని బెదిరించాడు. దీంతో, నాలుగేళ్ల పాటు ప్రాణభయంతో కుమిలి కుమిలి నరకం అనుభవించారు. తల్లిని కూడా చంపేస్తానని అనడంతో ఆమె కూడా తీవ్ర మనోవేదన అనుభవించింది. అయితే, రెండు రోజుల క్రితం తండ్రి ఆగడాలను భరించలేని ఆ కూతుళ్లు తల్లితో కలిసి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని బుధవారం అరెస్టు చేసిన పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు జూన్ 12 వరకు రిమాండ్ విధించి జైలుకు తరలించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.