Home /News /crime /

45 YEAR OLD CONFESSES TO MURDER HE DIDNT COMMIT HEART WRENCHING SAD STORY FROM WEST BENGAL SK

Very Sad: మర్డర్ చేయకుండానే చేశానంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వ్యక్తి.. అతడి కథ తెలిసి ఖాకీలకు కూడా కన్నీళ్లొచ్చాయి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

West Bengal: తాను తన అన్నని హత్య చేశానంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం అది హత్య కాదని తేలింది. మరి అతడు ఎందుకలా చెప్పాడో తెలుసా? గుండెలు పిండేసే కన్నీటి గాథ ఇది.

  ఈ రోజుల్లో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి నేరాలకు పాల్పడి వారు.. తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుంటారు. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు ఎన్నో తిప్పలు పడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం.. హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన సోదరుడిని తానే చంపేశానని.. శిక్ష వేయండని ఖాకీలను కోరాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అతడు హత్య చేయలేదు. కానీ తానే హత్య చేశానని.. జైల్లో వేయాలని (Man confesses to murder he didnt commit)కోరుకుంటున్నాడు. అసలు ఎందుకిలా చేశాడు? దీని వెనక ఉన్న కన్నీటి గాథ ఏమిటి? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  పెళ్లై 2 నెలలు కూడా కాలేదు..బంధువని చెప్పి ప్రియుడిని ఇంటికి పిలిచింది.. భర్తను చంపి..

  స్నేహాశిష్ చక్రబర్తి అనే 45 ఏళ్ల వ్యక్తి .. తన సోదరుడు దేబాశీష్ చక్రబర్తి (48)తో కలిసి సౌత్ కోల్‌కతా (Kolkata)లోని  బన్స్‌ద్రోని పోలీస్ స్టేషన్ పరిధి నిరంజన్‌పల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. ఐతే మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో స్నేహాశిష్ బన్స్‌ద్రోనీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన అన్నని హత్య చేశానని పోలీసులకు చెప్పాడు. అతడి మాటలు విని పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే ఓ కానిస్టేబుల్, ఎస్‌ఐ.. స్నేహాశిష్ నివాసానికి వెళ్లారు. అక్కడ నిజంగానే దేబాశీష్ మృతదేహం ఉంది.  అతడి మృతదేహంతో పాటు ఘటనాస్థలం మొత్తాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ ఎక్కడా హత్య జరిగిన ఆనవాళ్లు లేవు. కనీసం పెనుగులాట అయినట్లుగానీ అనిపించలేదు. మరి స్నేహాశిష్ ఎందుకలా చెప్పాడో పోలీసులకు అర్థం కాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది.  దేబాశీష్‌ను ఎవరూ చంపలేదని.. అసలది హత్య కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. అనారోగ్య సమస్యలతో అతడు మరణించినట్లు వెల్లడయింది. దేబాశీష్ బ్రెయిన్ స్ట్రోక్ (Cerebral hemorrhage)తో చనిపోయాడు. అంటే మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించి మరణించాడు. కానీ అతడి సోదరుడు స్నేహాశిష్ మాత్రం పోలీసుల వద్దకు వెళ్లి.. తానే తన అన్నని చంపానని చెప్పాడు. తన సోదరుడి ఆరోగ్యం బాగాలేదని.. మంచి ఆస్పత్రిలో చికిత్స అందించేంత ఆర్థిక స్థోమత తనకు లేదని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సోదరుడు పడుతున్న నరకయాతనను చూడలేకపోయాయని..ఆ బాధ నుంచి విముక్తి కల్పించేందుకే హత్య చేశానని చెప్పాడు. దిండును ముక్కు, నోటిపై అదిమిపట్టి.. ఊపిరాడకుండా చేసి చంపినట్లు వివరించాడు.

  ఆ దంపతులిద్దరికీ వేర్వేరుగా వివాహేతర సంబంధాలు.. సీక్రెట్​ బయటపడటంతో చివరికి ఊహించని విధంగా

  పోస్టుమార్టం రిపోర్టులో హత్య జరగలేదని తేలడంతో.. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. స్నేహాశీష్ తన అన్నని హత్య చేయకుండానే.. నేరాన్ని తనపై ఎందుకు వేసుకున్నాడో ఖాకీలకు అర్థం కాలేదు. ఐతే అతడి ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. తినడానికి తిండి కూడా లేదని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అన్నను హత్య చేసినట్లు చెబితే.. పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని.. అప్పుడు కనీసం అక్కడైనా అన్నం దొరుకుతుందని.. దేబాశీష్ భావించాడని చెప్పారు. స్నేహాశీష్ పరిస్థితిని చూసి.. పోలీసులు కూడా చలించిపోయారు. అతడికి భోజనంతో పాటు వసతి కల్పించే విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఐతే దేబాశీష్, స్నేహాశీష్ కలిసి మెలిసి ఉండేవారని.. ఒకరికి కష్టం వస్తే..మరొకరు తట్టుకోలేకపోయే వారని స్థానికులు చెప్పారు. దేబాశీష్ చనిపోవడంతో అతడి తమ్ముడు ఒంటరి వాడయ్యాడని కంటతడి పెట్టుకున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime story, Kolkata, West Bengal

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు