హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shameful Incident: 44 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఇదేం పని.. భర్తకు విడాకులిచ్చిన 53 ఏళ్ల మహిళను నమ్మించి...

Shameful Incident: 44 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఇదేం పని.. భర్తకు విడాకులిచ్చిన 53 ఏళ్ల మహిళను నమ్మించి...

ప్రదీప్ నాయర్ (ఫైల్ ఫొటో)

ప్రదీప్ నాయర్ (ఫైల్ ఫొటో)

అతని వయసు 44 సంవత్సరాలు. భర్తతో విడాకులు తీసుకున్న 53 ఏళ్ల మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో కలిసి జాలీగా తిరిగాడు. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కూడా కలిశారు. ఆమె అతనితో ప్రైవేట్‌గా గడిపిన సమయంలో సీక్రెట్‌గా ఫొటోలు తీశాడు.

ఇంకా చదవండి ...

తిరువనంతపురం: అతని వయసు 44 సంవత్సరాలు. భర్తతో విడాకులు తీసుకున్న 53 ఏళ్ల మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో కలిసి జాలీగా తిరిగాడు. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కూడా కలిశారు. ఆమె అతనితో ప్రైవేట్‌గా గడిపిన సమయంలో సీక్రెట్‌గా ఫొటోలు తీశాడు. ఆ మహిళతో గొడవ కారణంగా ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ మహిళకు షాకిచ్చాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రదీప్ నాయర్ అనే కేరళకు చెందిన వ్యక్తి ఫేస్‌బుక్‌లో 53 ఏళ్ల మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అప్పటికే ఆమె తన భర్తకు విడాకులిచ్చి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. చాటింగ్ ద్వారా ఆమెకు ప్రదీప్ దగ్గరయ్యాడు. అంతకు ముందు ఇద్దరిలో ఒకరికి మరొకరు తెలియదు. ఫేస్‌బుక్ ద్వారానే పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఒకరి ఫోన్ నంబర్స్ మరొకరు తీసుకుని కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకునేంత వరకూ వెళ్లింది. కొన్ని రోజులకు ఇద్దరూ నేరుగా కలుసుకున్నారు. ఇద్దరూ జాలీగా కలిసి తిరిగారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని ఆ మహిళను ప్రదీప్ నాయర్ నమ్మించాడు. ఆమె పూర్తిగా అతని మాయలో పడిపోయింది. ఒంటరిగా ఉన్న ఆ మహిళ ఇంటికి ప్రదీప్ తరచుగా వెళ్లేవాడు.

ఇలా వెళ్లిన సందర్భంలో ఆమెతో పలుమార్లు శారీరకంగా కలిశాడు. ఆమె నగ్నంగా ఉన్న స్థితిలో ఫోన్‌లో ఆమెకు తెలియకుండా ఫొటోలు తీశాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లిన ప్రతీ సందర్భంలో ఆ మహిళతోనే ప్రదీప్ డబ్బు ఖర్చు పెట్టించేవాడు. ఆమె కూడా కాబోయే వాడేనన్న నమ్మకంతో డబ్బు ఖర్చు పెట్టిస్తున్నా అతనిని తప్పుబట్టలేదు. ఇలా రోజులు గడిచాయి. నెలల గడిచాయి. అయినా.. ప్రదీప్ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. దీంతో.. ఆ మహిళకు అనుమానం వచ్చి పెళ్లి చేసుకుందామని పట్టుబట్టింది. ఇలా రోజులు వెళ్లదీయడం తన వల్ల కాదని, ఇద్దరం పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. అలా ఒత్తిడి చేసిన సందర్భంలో ప్రదీప్ నాయర్ గురించి ఆ మహిళకు పచ్చి నిజం తెలిసింది. తనకు పెళ్లి కాలేదని ప్రదీప్ నాయర్ చెప్పిన విషయం పచ్చి అబద్ధమని తేలింది. అతనికి కొన్నేళ్ల క్రితం పెళ్లైందని, ఇద్దరు పిల్లలు తండ్రి అనే విషయ తెలిసి బాధిత మహిళకు గుండె పగిలినంత పనైంది.

ఇది కూడా చదవండి: Shocking Incident: ‘అత్తయ్యా.. ఇది నా తరపున మీకు బర్త్‌డే గిఫ్ట్’ అని కోడలు ఎంతపని చేసిందంటే...

పెళ్లి కాలేదని.. అందుకు ఏవేవో కారణాలు చెప్పి ఆ మహిళను నమ్మించిన ప్రదీప్ దొరికిపోయేసరికి బుకాయించాడు. ఈ విషయంలో ఇదేంటని బాధితురాలు నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమెపై కోపంతో తన ఫోన్‌లో ఇద్దరూ కలిసి గడిపిన సమయంలో తీసిన ఫొటోలను ప్రదీప్ నాయర్ ఫేక్ ఐడీతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ మహిళకు కూడా వాట్సాప్‌లో ఫొటోలు పంపి షాకిచ్చాడు. ఆ ఫొటోలు చూసి నివ్వెరపోయిన బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి ప్రదీప్‌పై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రదీప్ నాయర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయం అంత మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

First published:

Tags: Crime news, Facebook friend, Kerala, Lover cheating, Married women

ఉత్తమ కథలు