శబరిమల పర్యటనలో ఆంధ్ర అయ్యప్ప భక్తుడు మృతి...

40 సంవత్సరాల కామేశ్వరరావు నీలిమల ఎక్కుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం కన్నుమూశాడు.

news18-telugu
Updated: November 27, 2019, 9:16 PM IST
శబరిమల పర్యటనలో ఆంధ్ర అయ్యప్ప భక్తుడు మృతి...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు కన్నుమూశాడు. ఈ విషయాన్ని శబరిమల పోలీసులు ధ్రువీకరించారు. ఏపీకి చెందిన 28 మంది అయ్యప్ప భక్తులు స్వామి మాల ధరించి శబరిమల వెళ్లారు. వారిలో 40 సంవత్సరాల కామేశ్వరరావు నీలిమల ఎక్కుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. అనంతరం కన్నుమూశాడు. మంగళవారం రోజు కూడా తమిళనాడుకు చెందిన ఓ అయ్యప్పభక్తుడు స్వామి దర్శనానికి వెళుతూ గుండెపోటుతో మృతిచెందాడు. మరోవైపు అయ్యప్ప స్వామి ప్రసాదంలో బల్లి కనిపించిందంటూ వచ్చిన వార్తలను ట్రావెన్‌కోర్ బోర్డు ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలని స్పష్టం చేసింది. దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ప్రశాంతంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>