వెల్లుల్లి దొంగిలించాడని.. లారీకి కట్టేసి కొట్టారు.. వైరల్ వీడియో

ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. స్థానికులపై మండిపడుతున్నారు. దొంగతనం చేస్తూ పట్టుబడితే పోలీసులకు అప్పజెప్పాలని.. అంతేగానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని అభిప్రాయపడుతున్నారు.

news18-telugu
Updated: July 24, 2020, 2:56 PM IST
వెల్లుల్లి దొంగిలించాడని.. లారీకి కట్టేసి కొట్టారు.. వైరల్ వీడియో
వెల్లుల్లి దొంగిలించాడని.. లారీకి కట్టేసి కొట్టారు.. వైరల్ వీడియో
  • Share this:
వెల్లుల్లి దొంగిలించాడన్న కారణంతో ఓ వ్యక్తిని లారీకి కట్టేసి కొట్టారు. తప్పయిందని వేడుకున్నా వదల్లేదు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఈ ఘటన జరిగింది. స్థానిక మార్కెట్‌లో 40 ఓ వ్యక్తి చోరీ చేశాడు. పెద్ద మొత్తంలో వెల్లుల్లి ఎత్తుకెళ్లడంతో స్థానికులు గమనించి అతడిని పట్టుకున్నారు. లారీకి కట్టేసి కర్రలతో ఎడాపెడా వాయించారు. ఐతే గతంలోనూ అతడిపై రెండు దొంగతనం కేసులున్నట్లు చెప్పారు. దొంగను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఐతే ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు.. స్థానికులపై మండిపడుతున్నారు. దొంగతనం చేస్తూ పట్టుబడితే పోలీసులకు అప్పజెప్పాలని.. అంతేగానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని అభిప్రాయపడుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 24, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading