Jitendra EV Fire probe: భారత దేశంలో అతి పెద్ద ఎలక్ట్రిక్ వాహానాల కంటెయినర్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు.. 40 కి పైగా స్కూటర్లను రవాణా చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనాలను (Electric vehicles) నాసిక్ సమీపంలో రవాణా చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జితేంద్ర కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహానాలు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి. స్కూటర్లను రవాణా చేసేటప్పులు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయలో కంటెయినర్ లో దాదాపు.. 40 వాహనాలు ఉన్నాయి.
ఈ క్రమంలో 20 వాహాలకు మంటలు వ్యాపించాయి. ఈ సంఘటన ఏప్రిల్ 9 న జరిగింది. పూణెలో ఉన్న హెగావ్ ప్రాంతంలో ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున కంటెయినర్ అంతటా మంటలు (Fire accident) వ్యాపించాయి. లిథియం,అయాన్ వలన అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావించారు. ఘటన జరగ్గానే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోనికి తెస్తున్నారు. ప్రమాదంలో దాదాపు 20 వాహానాలు చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది.
Blast at chemical factory : గుజరాత్(Gujarat)లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి. రియాక్టర్ వద్ద కార్మికులు పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు(Blast)సంభవించింది. పేలుడు కారణంగా ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు మంటల్లో చిక్కుకొని మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడి హాస్పిటల్ కు తరలించారు. మంటలు ఆర్పిన అనంతరం మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించినట్లు పెర్కోన్నారు. అయితే ఈ ప్రమాదంలో మరెవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు,గతేడాది ఆగస్టులో కూడా ఇదే పారిశ్రామిక వాడలోని మరో రసాయన కంపెనీలో పెలుడు సంభవించింది. ఆ ఘటనలో ఓ కార్మికుడులు దర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Maharashtra, New electric bike, Pune