తెలంగాణలో విషాదం.. పానీ పూరి తిని 40 మంది చిన్నారులకు అస్వస్థత..

ఫుడ్ పాయిజన్ అయి - 50 మంది చిన్నారులకు అస్వస్థత

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సుమారు 50 చిన్నారులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు.

  • Share this:
    లాక్‌డౌన్ దెబ్బకు పానీ పూరీ బండ్లు కనిపించకుండా పోయాయి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పెద్ద హోటళ్ల దగ్గర నుంచి చిరుతిళ్ల హోటళ్ల వరకు అన్నీ బంద్ చేశారు. సాయంత్రం అయ్యిందంటే పానీ పూరీ బండ్ల వద్దకు లైన్ కట్టే విద్యార్థులు, చిన్నారులు, తల్లిదండ్రులు.. ఇప్పుడు జిహ్వకు రుచి చూపించలేకపోతున్నామని బాధపడుతున్నారు. పానీ పురీ తినాలని ఉంది కేసీఆర్ తాతా అని ఓ చిన్నారి వీడియో ద్వారా కేటీఆర్‌ను కోరింది. పానీ పూరీ అంటే అంత ఇష్టం.  అయితే.. తెలంగాణలో పానీ పూరీ తిని 40 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖుర్షిద్‌నగర్‌, సుందరయ్య నగర్‌కు చెందిన చిన్నారులు సోమవారం సాయంత్రం ఓ తోపుడుబండి వద్ద పానీపూరి తిన్నారు. ఓ గంటకే వాళ్లకు వాంతులు, విరేచనాలు కావడం మొదలైంది. ఒకరి తర్వాత మరొకరు మొత్తం 40 మంది రిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. దీనికి కారణం ఏంటని ఆరా తీయగా పానీ పూరీ తిన్నట్లు వెల్లడైంది.

    చిన్నారులంతా కోలుకుంటున్నారని, వారికి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. పానీ పూరీ అమ్మకాలకు అనుమతి లేకున్నా.. కొంత మంది ఉపాధి కోసం వీధుల్లో తిరుగుతూ పానీ పూరీ అమ్ముతున్నారు. అయితే, కరోనా సమయంలో ఇలాంటి ఘటనలు భయపెడుతున్నాయి.
    Published by:Venu Gopal
    First published: