• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 40 CALL GIRLS BOLLYWOOD ACTRESSES WERE ENGAGED IN MADHYA PRADESH BLACKMAIL SCANDAL BS

భారీ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు.. మాజీ సీఎం, గవర్నర్ కూడా..

భారీ సెక్స్ స్కాండల్ గుట్టు రట్టు.. మాజీ సీఎం, గవర్నర్ కూడా..

ప్రతీకాత్మక చిత్రం

మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ స్కాండల్ బయటపడింది. దాదాపు 40 మంది కాల్ గర్ల్స్‌తో రాజకీయ నాయకులు, అధికారులకు వలపు వల వేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

  • Share this:
    మధ్యప్రదేశ్‌లో భారీ సెక్స్ స్కాండల్ బయటపడింది. దాదాపు 40 మంది కాల్ గర్ల్స్‌తో రాజకీయ నాయకులు, అధికారులకు వలపు వల వేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులకు వలపు వల వేసి, వారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు గుర్తించి, వారివద్ద 92 హై క్వాలిటీ వీడియోలను, రెండు ల్యాప్‌టాప్‌లను, పలు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు మహిళల్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ భారీ బ్లాక్‌మెయిల్ స్కాండల్.. శ్వేత స్వప్నిల్ జైన్ అనే మహిళ నేతృత్వంలో నడుస్తోందని తెలుసుకొని, ఆమెను అరెస్టు చేయడంతో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆమె.. బాలీవుడ్‌కు చెందిన బీ గ్రేడ్ నటీమణులతో పాటు, 40 మంది టాప్ క్లాస్ కాల్ గర్ల్స్‌తో ఒక ముఠాను ఏర్పాటు చేసింది. వారితో రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు వల వేసి, వారికి దగ్గరయ్యేలా చేసేది. సెక్స్ అంటూ వారిని లొంగదీసుకొని.. పడకగదికి రప్పించేది. తాను చెప్పిన గెస్ట్ హౌజ్ గానీ, ఫైవ్ స్టార్ హోటల్‌కు గానీ రావాలని వారికి చెప్పేది.

    ఆమె చెప్పిన చోటుకు వెళ్లి, సదరు వ్యభిచారిణితో సెక్స్‌లో పాల్గొంటుండగానే.. ముందుగా ఏర్పాటు చేసిన మొబైల్ కెమెరా లేదా స్పై కెమెరాతో ఆ తతంగాన్ని వీడియో తీసి.. ఆ వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేయించేది. అలా మొత్తం 92 హై క్వాలిటీ వీడియోలను హార్డ్ డిస్క్‌లలో భద్రపరిచిందామె. వాటితో రాజకీయ నాయకులను, అధికారులను బ్లాక్‌మెయిల్ చేయించి.. ఓ మాజీ సీఎం నుంచి విలాసవంతమైన బంగ్లాను కూడా దక్కించుకుంది. ప్రభుత్వ కాంట్రాక్టులను కూడా దక్కించుకుంది. దీనికి శ్వేత భర్త స్వప్నిల్ జైన్ కూడా సాయపడ్డట్లు పోలీసులు గుర్తించారు.

    వీరి వలలో పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చిక్కుకున్నట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్ వేదికగా ఏళ్లుగా ఈ కుంభకోణం నడుస్తోందని, ఇందులో చిక్కుకున్న వారిలో 80 శాతం బీజేపీ నేతలు ఉన్నారని తెలిపారు. 20 శాతం కాంగ్రెస్ నేతలు ఉన్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ నేతలు ఉన్నా వారిని అరెస్టు చేస్తామని ఆయన వెల్లడించారు.

    శ్వేత మాత్రమే కాకుండా ఆర్తి దయాల్ అనే మహిళ కూడా ఇలాగే అధికారులకు, రాజకీయ నాయకులకు వలపు వల వేసినట్లు పోలీసులు తేల్చి ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును, సీడీలు, హార్డ్ డిస్క్‌ను సిట్‌కు అప్పగించారు. అయితే, తమ పేర్లు బయటికి పొక్కుతాయని రాజకీయ నాయకులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    అగ్ర కథనాలు