ఏపీలో మరో ఘోరం.. 4 ఏళ్ల పసిపాపపై అత్యాచారం

ఏపీలో దిశ లాంటి కఠిన చట్టం తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. గత 10 రోజుల వ్యవధిలో ఇది మూడో అత్యాచార ఘటన.

news18-telugu
Updated: December 19, 2019, 7:29 PM IST
ఏపీలో మరో ఘోరం.. 4 ఏళ్ల పసిపాపపై అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం వంటి కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మరో దారుణం చోటుచేసుకుంది. కొత్త పీఎస్ పరిధిలో నాలుగేళ్ల నేపాల్ బాలికపై అత్యాచారం జరిగింది.

అభంశుభం తెలియని పసిపాపపై 40 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని కొట్టి.. నోరుమూసి.. తన పశువాంఛను తీర్చుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక శరీరంపై గాయాలు కనిపించడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. ఏం జరిగిందోనని ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. అనంతరం బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఏపీలో దిశ లాంటి కఠిన చట్టం తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. గత 10 రోజుల వ్యవధిలో ఇది మూడో అత్యాచార ఘటన. ఈ నేపథ్యంలో మహిళలు, చిన్నపిల్లల భద్రతపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది. చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయని అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు