ఏపీలో దారుణం.. స్కూల్‌ నుంచి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం

నాలుగేళ్ల బాలిక స్కూల్లో ఆడుకుంటుండగా పొట్లూరు అంజయ్య అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పాప నోరుమూసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.


Updated: January 22, 2020, 6:42 PM IST
ఏపీలో దారుణం.. స్కూల్‌ నుంచి బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దిశా వంటి కఠిన చట్టాలు తెచ్చినా సమాజంలో మార్పు రావడం లేదు. ఆడవారి పట్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో దారుణం జరిగింది. నాలుగో తరగతి బాలికపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల బాలిక స్కూల్లో ఆడుకుంటుండగా పొట్లూరు అంజయ్య అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పాప నోరుమూసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు