దిశా ఘటన జరిగిన చటాన్‌పల్లిలో కలకలం.. నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

కిడ్నాపర్ పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

news18-telugu
Updated: December 17, 2019, 9:23 PM IST
దిశా ఘటన జరిగిన చటాన్‌పల్లిలో కలకలం.. నాలుగేళ్ల బాలిక కిడ్నాప్
Video : చటాన్‌పల్లిలో కలకలం.. నాలుగేళ్ల బాలిక కిడ్నాప్
  • Share this:
దిశా హత్యాచార ఘటన నేపథ్యంలో షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి పేరు దేశమంతటా మార్మోగిన విషయం తెలిసిందే. దిశను నిందితులను అక్కడే తగలబెట్టారు. నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం కూడా అదే. ఐతే తాజాగా చటాన్‌పల్లిలో మరోసారి కలకలం రేగింది. స్నేహిత అనే 4 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు.

మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక, ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బాలికను కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్లాడు. చాక్లెట్లు ఆశచూపి స్నేహితను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పాప తండ్రి శివకుమార్ మేస్త్రిగా పనిచేస్తాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్ పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బృందాలుగా విడిపోయి కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

Published by: Shiva Kumar Addula
First published: December 17, 2019, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading