హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: వీరిని ఏంచేసిన పాపం లేదు... బాలికపై ఏడాదిగా నలుగురు మైనర్ల అత్యాచారం..

Shocking: వీరిని ఏంచేసిన పాపం లేదు... బాలికపై ఏడాదిగా నలుగురు మైనర్ల అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Punjab: హోషియాపూర్ గ్రామంలో అత్యంత జుగుప్సాకర సంఘటన జరిగింది. ఒక బాలికపై, నలుగురు మైనర్లు ఏడాదిగా అత్యాచారం చేస్తున్నారు. బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో దారుణం వెలుగులోనికి వచ్చింది.

4 Minors molested 6 Year Old Girl Over A Year In Punjab: సమాజంలో మహిళల భద్రత ప్రస్తుతం పెనుసవాల్ గా మారింది. కామాంధులు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. ప్రభుత్వాలు దిశ, నిర్భయ చట్టాలు తీసుకొచ్చిన ఈ నీచులలో ఏమాత్రం మార్పు రావడం లేదు. కేవలం క్షణికమైన సుఖం కోసం పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మరీ దారుణంగా పశువులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

గుడి, బడి, బస్టాండ్, ఆఫీస్, ఇలా మహిళ వేధింపులకు గురవ్వని చోటు ఉందా.. అంటే లేదని సమాధానం వస్తుంది. కేవలం అమ్మ కడుపులో ఉన్న తొమ్మిది నెలల మాత్రమే బాలకలకు రక్షణ ఉంది. కొన్ని చోట్ల కన్నతండ్రి, అన్న.. తమ వారిపై అఘాయిత్యాలకు పాల్పడిన సంఘటనలు వార్తలలో నిలిచాయి. ఇంటి పక్కన.. తెలిసిన వారు కూడా ఏమాత్రం అదును దొరికిన అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. పంజాబ్ లోని హోషియాపూర్ లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సదరు గ్రామంలో ఆరేళ్ల బాలికను, అదే గ్రామానికి చెందిన నలుగురు మైనర్ బాలికలకు అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో దారుణం వెలుగులోనికి వచ్చింది. నిందితులంతా 10 నుంచి 11 ఏళ్ల మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

వారంతా బాలికకు తెలిసిన వారే కావడంతో తల్లిదండ్రులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఆ తర్వాత.. బాలిక చెప్పడంతో దారుణం బయటపడింది. నలుగురు వ్యక్తులు ఏడాదిగా పలుమార్లు అత్యాచారం చేశారని బాలిక ఇంట్లో వారికి తెలిపింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకుని జువైనల్ హోమ్ కు తరలించారు. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Woman and her 2 children found suicide in Gujarat

కొందరు చిన్న చిన్న విషయాలకు తమ దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు చెప్పినదానికి ఒప్పుకోకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు పరీక్షలో  తప్పామని, సరైన ఉద్యోగం రాలేదని, ప్రేయసీ పెళ్లికి ఒప్పుకోలేదని సిల్లి రిజెన్స్ తో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు వార్తలలో చూస్తునే ఉంటాం. ఇక్కడోక మహిళ తనను భర్త పెళ్లికి పోనివ్వలేదని సిల్లి రిజన్ తో సూసైడ్ చేసుకుంది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లోని సూరత్ లో దారుణమైన ఉదంతం వెలుగులోనికి వచ్చింది. సోథియా గ్రామంలోని ఒక జంట ఎనిమిదేళ్ల క్రితం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకరికి ఏడేళ్లు, మరోకరికి ఐదేళ్లు. అయితే, సదరు వ్యక్తి భార్య, తన పుట్టింటికి పెళ్లికి వెళ్తానని భర్తను కోరింది. తనకు డబ్బులు ఇవ్వాలని అడిగింది. అయితే, సదరు వ్యక్తి మాత్రం పెళ్లికి వెళ్లడానికి అంగీకరించలేదు.

అత్తింటి వారు కూడా ఎవరు దీనికి ఒప్పుకోలేదు. దీంతో మహిళ కోపంతో తన విచక్షణను కోల్పోయింది. తన భర్తమీద ఉన్న కోపాన్ని పిల్లల మీద చూపింది. తన గ్రామానికి దగ్గరలో ఉన్న.. గోండా గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ దగ్గరకి తన పిల్లలతో పాటు చేరుకుంది. ఆ తర్వాత వేగంగా వస్తున్న రైలు ముందు దూకి సూసైడ్ చేసుకుంది. ఎంత సేపటికి కోడలు ఇంటికి రాకపోవడంతో అత్తింటి వారు వెతకడం ప్రారంభించారు. కాసేపటికి వీరు పట్టాలమీద విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి కన్నీటి పర్యంత మయ్యారు. క్షణికావేశంలో మహిళ తీసుకున్న నిర్ణయం వలన మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Harassment, Harassment on women, Minor girl, Punjab

ఉత్తమ కథలు